సాధారణంగా కొంతమంది స్వీట్ ని ఎక్కువగా ఇష్టపడితే మన కొంతమంది హాట్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే స్వీట్ పదార్థాలలో ఎప్పుడూ పాలకోవా బర్ఫీ ఇలాంటివి మాత్రమే కాకుండా కాస్త కొత్త కొత్తగా ఏవైనా తినాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. ఇంట్లో చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. మరి అటువంటి వారి కోసం ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే కోవా రవ్వ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో అందుకు కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కోవా రవ్వ బర్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు:
బొంబాయి రవ్వ – అర కప్పు
పచ్చి కోవా –అర కప్పు
పాలు – అర కప్పు
పంచదార – అర కప్పు
యాలకుల పొడి – అర టీస్పూన్
నెయ్యి – పావు కప్పు
కుంకుమ పువ్వు – చిటికెడు
కోవా రవ్వ బర్ఫీ తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా పాలు వేడి చేసుకోవాలి. రెండు స్పూన్ల వేడి పాలలో కుంకుమ పువ్వును నానబెట్టాలి. తర్వాత నెయ్యి వేడి చేయాలి. తర్వాత అందులో రవ్వ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టాలి. అనంతరం
అదే కడాయిలో కోవా, పాలు పోసి కోవా కరిగేంత వరకు కలబెట్టాలి. అందులో చక్కెర కూడా వేసి కరిగేంత వరకు తిప్పాలి. తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ, నానబెట్టిన కుంకుమ పువ్వు, యాలకుల పొడి అందులో కలపాలి. ఈ మిశ్రమం దగ్గర పడేవరకు బాగా కలపాలి. మిశ్రమం అంచులు విడుస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. నెయ్యి రాసిన పళ్లెంలో పోసుకుని, అందులో తరిగిన డ్రైఫ్రూట్స్‌ను వాటిపై చల్లి సిల్వర్ పేపర్ తో అలంకరించుకోవాలి. ఆ తర్వాత కొద్దిసేపు అయ్యాక చల్లని తర్వాత మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేపులో కట్ చేసుకుని తినవచ్చు. అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కోవా రవ్వ బర్ఫీ రెడీ.