ఉప్పు అనేది మన రోజువారీ జీవితంలో తప్పనిసరి పోషక పదార్థం. సాధారణంగా మార్కెట్లో ఉప్పు ధర కేజీకి రూ.30 నుండి రూ.200 వరకు ఉంటుంది. కానీ కొరియన్ బాంబూ సాల్ట్ (Korean Bamboo Salt) అనేది మాత్రం కేజీకి రూ.20,000 నుంచి రూ.30,000 వరకు విలువ చేసే ప్రీమియం ఉప్పుగా గుర్తింపు పొందింది. దీని ప్రత్యేకత ఏమిటి? ఎందుకు ఇది అంత ఖరీదు? అంటే ..
Pawan Kalyan : ఇదేనా నీ నుండి ప్రజలు కోరుకుంది..పవన్..? – రామకృష్ణ ఫైర్
కొరియన్ బాంబూ సాల్ట్‌ను తొలుత కొరియాలో తయారుచేశారు. దీన్ని తయారు చేసే విధానం చాలా ప్రత్యేకమైనది. సముద్రపు ఉప్పును వెదురు (బాంబూ) బొంగులో నింపి దాన్ని 400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కాల్చుతారు. ఈ ప్రక్రియను ఒక్కసారి కాదు, ఏకంగా 9 సార్లు వరుసగా చేస్తారు. చివరికి, ఉప్పు స్పటిక (crystal) రూపంలోకి మారుతుంది. ఈ విధానంతో ఉప్పులోని మలినాలు పూర్తిగా తొలగిపోయి, ఇందులో ఉన్న ఖనిజాలు మరింత సమృద్ధిగా మారతాయి.
ఇందులో ఏమున్నాయి?
సాధారణ ఉప్పులో కొద్ది మినరల్స్ మాత్రమే ఉంటాయి. అయితే, కొరియన్ బాంబూ సాల్ట్‌లో 73 రకాల ఖనిజాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన మినరల్స్ ఇందులో ఉంటాయి. ఈ మినరల్స్ శరీరానికి పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య ప్రయోజనాలు
కొరియన్ బాంబూ సాల్ట్‌ను ఉపయోగిస్తే శరీరంలో యాసిడిటీ తగ్గుతుందని, జీర్ణ వ్యవస్థ మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని తినడం ద్వారా డిటాక్సిఫికేషన్ జరిగి, శరీరంలో హానికరమైన టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి. అంతే కాకుండా, ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచడం, గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. కొందరు నిపుణులు దీన్ని క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే అద్భుతమైన ఆయుర్వేద ఔషధంగా కూడా చెబుతున్నారు.
భారతదేశంలో ఉత్పత్తి & భవిష్యత్తు
కొరియన్ బాంబూ సాల్ట్ ఇప్పుడు మన దేశంలో కూడా ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా, ఉత్తరాఖండ్ ప్రభుత్వం దీన్ని తయారు చేయడం ప్రారంభించింది. ఇది భారతీయ ఆరోగ్య చిట్కాల్లో భాగం అవుతుందా? అనే దానిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే, అత్యధిక ఖనిజాలతో, ప్రాముఖ్యతతో, ఈ ప్రత్యేక ఉప్పు భవిష్యత్తులో మరింత ప్రాచుర్యం పొందే అవకాశముంది.