Genetic Testing: మీ జీన్స్ చూసి మీకు ఏ వ్యాధి వస్తుందో చెప్పచ్చు.. అది ఎలా అంటే?

రోజురోజుకీ టెక్నాలజీ మరింత డెవలప్ అవుతూనే ఉంది. ప్రస్తుత రోజుల్లో అయితే ప్రతి ఒక విషయంలో కూడా

  • Written By:
  • Publish Date - July 27, 2022 / 06:30 AM IST

రోజు రోజుకీ టెక్నాలజీ మరింత డెవలప్ అవుతూనే ఉంది. ప్రస్తుత రోజుల్లో అయితే ప్రతి ఒక విషయంలో కూడా టెక్నాలజీని ఉపయోగిస్తూ దానిని మరింత పెంచుకునేందుకే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మామూలుగా ఒకరి జన్యువులను పరీక్షించడం ద్వారా భవిష్యత్తులో వారికి ఎటువంటి వ్యాధులు ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్నది ముందుగానే చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు. దీనినే జెనెటిక్ టెస్టింగ్ గా చెబుతున్నారు. దీనివల్ల మనకు ముందుగానే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో వాటిపట్ల జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ జెనెటిక్ టెస్టింగ్ పరీక్షలో కుటుంబంలో ఎవరికైనా ఏదైనా వ్యాధి ఉంటే అది ఆ తర్వాత వారసులకు వస్తుందా అన్నది తెలుస్తుందట.

ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జన్యు వైవిధ్యాల వల్ల ఏ వ్యాధి వస్తుంది అన్నది సులభంగా తెలుసుకోవచ్చు అని నిపుణులు అంటున్నారు. అయితే జన్యువుల్లో పోలిక ఉన్నంత మాత్రాన వ్యాధి రావాలని ఏమీ లేదట ఎందుకంటే జీవనశైలి, అలాగే మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా వ్యాధులను నిర్ణయించవచ్చట. అయితే ఈ జన్యువుల పరీక్ష ద్వారా కొన్ని సమస్యలను రాకుండా చూసుకోవచ్చట. మధుమేహం.. మన పెద్దవారికి కానీ ఇంట్లో ఎవరికైనా ఉంటే ఈ మధుమేహం వారసులకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయట. అయితే ఈ మధుమేహం వారసులకు రావడం వెనుక ఎన్నో జన్యువులు కీలకపాత్రను పోషిస్తున్నాయట. సీఏపీఎన్ 10, టీసీఎఫ్7ఎల్ 2, ఏబీసీసీ, సీసీజీఆర్ అనే జన్యులకు మధుమేహంతో సంబంధం ఉంటుందట.

అలాగే ఆహారం తీసుకోవాలని చెప్పే సంకేతాలు ఇవ్వడం వెనుక జన్యుల పాత్ర కూడా ఉంటుందట. ఈ జీన్స్ లో వచ్చే మార్పులే ఒకరు ఎంత చురుగ్గా ఉంటున్నారు అన్నది నిర్ణయిస్తాయి. కాగా తల్లిదండ్రులకు లేదా పెద్దలకు స్థూలకాయత్వం ఉంటే కచ్చితంగా వారసులకు పిల్లలకు రావచ్చు. ఎఫ్ టీవో, ఎల్ఈపి, ఎల్ఈపిఆర్, ఎంసీఆర్ 4 ఇవన్నీ కూడా బరువుకు సంబంధించినవి. ఈ జన్యుల్లో వచ్చే కొన్ని మార్పుల వల్ల ఉన్నట్టుండి లావుగా ఒళ్ళు పెరిగిపోవచ్చు. దీని నుండి బయటపడాలి అంతే జీవనశైలిలో మార్పుల ద్వారా ఈ రిస్క్ ను అధిగమించవచ్చు. జన్యువులు గుండె జబ్బులు రక్తపోటును ప్రభావితం చేస్తూ ఉంటాయి. కుటుంబంలో ఎవరికైనా అధిక రక్తపోటు ఉంటే అది వారసులకు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అలాగే రొమ్ము క్యాన్సర్ రావడానికి జన్యుల పాత్ర 5 నుంచి 10% గానే ఉంటుంది. అలాగే ఒవేరియన్ క్యాన్సర్ వారసత్వంగా వచ్చే అవకాశాలు పెరిగాయి. అయితే జన్యుపరమైన వ్యాధుల్లో ఎక్కువ శాతం వీటిని నయం చేయలేం కానీ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల వీటిని అధిగమించవచ్చు.