Kidney Beans and Diabetes: కిడ్నీ బీన్స్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా? ఇవి తింటే మధుమేహం నుంచి ఆ వ్యాధులు అన్నీ నయం!

ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. చిన్న, పెద్ద అనే వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ

  • Written By:
  • Publish Date - August 29, 2022 / 10:00 PM IST

ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. చిన్న, పెద్ద అనే వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో చాలామంది తాము ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏది తీసుకోవద్దు అనే అనుమానంలో ఉంటారు. కానీ కిడ్నీ బీన్స్ అనేది మధుమేహం వాళ్లకు చాలా మంచిదని తెలుస్తుంది. ఇది తినడం వల్ల ఇతర వ్యాధులలో కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఇందులో ఎటువంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం.

ఫైబర్: ఫైబర్ మన శరీరానికి చాలా మంచిది. ఈ బీన్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. 100 గ్రాముల కిడ్నీ బీన్స్‌లో 6.4 గ్రా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు కూడా మంచిది.

ప్రొటీన్లు: ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం శరీరానికి చాలా అవసరం. కాబట్టి ఒక కప్పు కిడ్నీ బీన్స్‌ తీసుకున్నట్లయితే అందులో 14 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

పొటాషియం: కిడ్నీ బీన్స్ లో ఉండే అధిక పొటాషియం రక్తనాళంలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కార్బోహైడ్రేట్లు: ఈ కిడ్నీ బీన్స్‌లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి నెమ్మదిగా విడుదలవుతాయి. ఇవి రక్తంలో చక్కెరను పెంచవు. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు వంటివి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి.

గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ: మధుమేహ వ్యాధిగ్రస్తులు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ కిడ్నీ బీన్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవడం మంచిది.