జామపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో విటమిన్ సి తో పాటు ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. జామ పండు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే కడుపుకి సంబంధించిన అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. జామపండు చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంది. దీనిని పేదోడి యాపిల్ అని కూడా అంటారు. జామ తినడానికి ఎంతో రుచిగా ఉండడంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అందుకే చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీనిని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.
జామ పండు తినడం మంచిదే కానీ కొన్ని విధాలుగా తీసుకుంటే అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని చెబుతున్నారు. మరి జామ పండును ఎలా తింటే మంచిది అన్న విషయానికి వస్తే..జామపండులో పోషకాలు అధికంగా ఉన్నాయి. చలికాలంలో జామపండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. జామపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో చలికాలంలో వచ్చే వ్యాధుల్ని తట్టుకునే శక్తి వస్తుంది. ఇందులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. మలబద్ధక సమస్యతో బాధపడేవారికి జామపండు అద్భుతంగా పనిచేస్తుంది.
కొంతమంది జామ పండ్లు నేరుగా తింటే మరికొందరు ఉప్పు కారం కలిపి తింటూ ఉంటారు. జామ పండుని నిప్పుల్లో కాల్చి తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చట. ఇలా నిప్పులపై కాల్చి తినడం వల్ల వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు పరిమాణం పెరుగుతుందట. మీ రోగనిరోధక శక్తి మరితం బలంగా మారుతుందట. అనేక వ్యాధుల బారిన పడకుండా తప్పించుకోవచ్చని చెబుతున్నారు.. దగ్గు, కఫం నుంచి ఉపశమనం పొందాలంటే జామపండును తినాలని నిపుణులు చెబుతున్నారు. నిప్పులపై కాల్చిన జామపండును తినడం వల్ల కఫం కరగడమే కాకుండా ఛాతీలో పేరుకుపోయిన శ్లేష్మం తగ్గుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా అసిడోఫైల్స్ సమస్య ఉన్న వారికి కూడా జామ చాలా మేలు చేస్తుందట. ఇది శరీరంలో మంటను తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుందని చెబుతున్నారు.