Urinate: పురుషులు నిలబడి మూత్రం పోస్తున్నారా.. అయితే జాగ్రత్త?

సాధారణంగా పురుషులు నిలబడి మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. చాలా తక్కువమంది మాత్రమే మూత్ర విసర్జన చేస్తూ

Published By: HashtagU Telugu Desk
Urinate

Urinate

సాధారణంగా పురుషులు నిలబడి మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. చాలా తక్కువమంది మాత్రమే మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. బహిరంగ ప్రదేశాలల్లో మాత్రమే కాకుండా పబ్లిక్ టాయిలెట్స్ లో కూడా పురుషులు ఆ విధంగానే నిలబడి మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. చాలామంది పురుషులకు తెలియని విషయం ఏమిటంటే కూర్చుని మూత్ర విసర్జన చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నెదర్లాండ్ లోని వైద్యులు మూత్ర విసర్జన చేసేటప్పుడు పురుషులు కూర్చోవడం వల్ల ముఖ్యంగా ప్రోస్టేట్ వంటి సమస్యలు ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

ఎందుకంటే నిలబడడం కంటే కూర్చోవడం వల్ల మూత్రం ఎక్కువ ఒత్తిడితో బయటకు వస్తుంది. నిలబడి మూత్ర విసర్జన చేయడం వల్ల పొత్తికడుపు వెన్ను కండరాలు సంకోచించబడతాయి. కూర్చుని మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు కటి,తుంటి కండరాలు సడలించి మూత్ర విసర్జనను సులభతరం చేస్తాయి. కూర్చున్నప్పుడు ఉదర కండరాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. కూర్చుని మూత్ర విసర్జన చేయడం వల్ల మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవుతుంది. ఒకవేళ మూత్ర విసర్జన తరువాత మూత్రశయం పూర్తిగా ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తే నిలబడి కూడా మూత్ర విసర్జన చేయవచ్చు.

మూత్ర విసర్జన చేసినా కూడా మూత్రశయం ఎప్పుడు నిండుగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది. క్రమంగా అది సమస్యలకు కూడా దారితీస్తుంది. మూత్రశయం ఖాళీ కాకపోతే అది మూత్రాన్ని పట్టి ఉంచి ఇన్ఫెక్షన్ లేదా మూత్రంలో రాళ్లకు దారితీస్తుంది. మూత్రశయంలో కొంత మూత్రం అలాగే మిగిలి ఉంటే యూరియా లోని రసాయనాలు కలిసి స్పటికాలుగా ఏర్పడతాయి. క్రమంగా ఆ స్పటికాలు గట్టిపడి మూత్రశయంలో రాళ్లను ఏర్పరుస్తాయి.

  Last Updated: 13 Apr 2023, 04:21 PM IST