ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు వెన్నునొప్పి సమస్య కూడా ఒకటి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఈ వెన్నునొప్పి సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. సిస్టం ముందు ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల వెన్ను నొప్పి సమస్య తీవ్రమవుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఒకే చోట కదలకుండా అలాగే కూర్చుని ఉండడం వల్ల కూడా ఈ వెన్నునొప్పి సమస్య వస్తూ ఉంటుంది. కొందరినీ ఈ వెన్ను నొప్పి సమస్య తరచూ వేధిస్తుంటే మరికొందరిని అప్పుడప్పుడు వేధిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో కొన్ని రకాల చిట్కాలు పాటించడం తప్పనిసరి.
అయితే చాలామంది వెన్నునొప్పి తగ్గించడానికి రకరకాల బామ్స్, ఆయిల్స్, మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. వీటి వల్ల టెంపరరీ రిలీఫ్ ఉంటుంది కానీ, శాశ్వతంగా ఉపశమనం లభించదు. కొన్ని న్యాచురల్ పద్ధతులతో, జాగ్రత్తలతో వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. బరువు ఎక్కువగా ఉన్నా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. వెన్నునొప్పిని నివారించడానికి, బరువు తగ్గండి. దిగువ వీపు నుంచి ఒత్తిడిని తగ్గించవచ్చు. కొవ్వు ఉండే ఆహారాలు అస్సలు తినకూడదు. మీ ఆహారంలో చక్కెర తగ్గించాలి. ఆకుకూరలు, కూరగాయలతో పాటు అవిసె గింజలు, సబ్జా గింజలు ఎక్కువగా తీసుకోవాలి అలాగే సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. కరివేపాకు ఎక్కువగా తీసుకోండి.
దీనిలో ల్యూటిన్, ఫోలిక్‌యాసిడ్, ఇనుమూ, క్యాల్షియం, నియాసిన్, బీటాకెరొటిన్ వంటి పోషకాలెన్నో ఉంటాయి. క్యాల్షియం ఎముకల్ని దృఢంగా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లూ ఎక్కువే. కరివేపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను, ఇన్ఫెక్షన్లను నుంచి రక్షిస్తాయి. ఇవి వెన్నునొప్పితో బాధపడేవారికి మేలు చేస్తాయి. వెన్నునొప్పితో బాధపడేవారు రోజూ కచ్చితంగా వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఎన్ని పనులున్నా ఎక్సర్‌సైజ్ చేయడానికి టైమ్ కేటాయించండి. మీ రెండు చేతుల వేళ్లతో.. మీ కాళ్ల వేళ్లను ముట్టుకోండి. ఇలా చేసేటపపుడు మీ కాళ్లు నిఠారుగా ఉండాలి. కోబ్రా పోస్ పెట్టిన మీకు వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆఫీస్‌లో డెస్క్ ముందు నిఠారుగా కూర్చోండి. అలాగే నిలబడినప్పుడు పక్కకి వంగకూడదు. నిఠారుగా కూర్చోవడం వల్ల వెన్నెపూసపై భారం తగ్గుతుంది. తద్వారా బ్యాక్ పెయిన్ పెద్దగా రాదు. మీ తలను తిన్నగా పైకి ఉంచండి. మీకు వెన్ను నొప్పి ఉంటే మీరు మీ వెన్నెముకను సక్రమంగా ఉంచడానికి టేప్, పట్టీలు లేదా స్ట్రెచి బ్యాండ్‌లను ఉపయోగించవచ్చు.