Site icon HashtagU Telugu

Walking after the meal: భోజనం తర్వాత 10 నిమిషాల నడక వల్ల కలిగే లాభాలు ఎన్నో?

Benefits Of Morning Walk

Walking

ఈ రోజుల్లో చాలామంది బిజీ బిజీ షెడ్యూల్ వల్ల సరిగా సమయానికి తినకపోగా తిన్న వెంటనే పడుకొని నిద్రపోతూ ఉంటారు. మరీ ముఖ్యంగా చాలామంది రాత్రి సమయంలో తిన్న వెంటనే నిద్రపోతూ ఉంటారు. కానీ అలా చేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అలా తిన్న వెంటనే పడుకొని నిద్ర పోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తడంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే రాత్రి సమయంలో తిన్న తర్వాత కొద్దిసేపు నడవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ఇలా తిన్న వెంటనే నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయి. మరి ఆ లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

భోజనం చేసిన తర్వాత కొంత సమయం నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీర కదలికలు కడుపు, పేగలను యాక్టివ్‌ చేసి జీర్ణక్రియకు సహాయపడతాయి. దీని వల్ల ఆహారం మరింత వేగంగా కదులుతుంది. తిన్న తర్వాత తక్కువ నుంచి మితమైన శారీరక శ్రమ జీర్ణశయాంతర ట్రాక్ట్‌ను రక్షిస్తుంది. తిన్న తర్వాత నడిస్తే పెప్టిక్ అల్సర్లు, గుండెల్లో మంట, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ డైవర్టిక్యులర్ డిసీజ్, మలబద్ధకం, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌ చేస్తుంది. తిన్న తర్వాత కొంత సమయం నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. టైప్‌ 1, టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్న వ్యక్తులు ఇది చాలా మేలు చేస్తుంది. తిన్న తర్వాత చిన్న శారీరక శ్రమ చేయడం వల్ల బ్లడ్‌ షుగర్‌ స్పైక్‌‌లను నిరోధించవచ్చు.

తద్వారా ఇన్సులిన్‌, ఓరల్‌ మెడిసిన్‌ మొత్తాన్ని తగ్గించవచ్చు. టైప్‌ 2 డయాబెటిక్‌ పేషెంట్స్‌ తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. తిన్న తర్వాత నడక వల్ల శరీరంలో ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. రిలాక్స్‌గా ఫీల్ అవుతారు. నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.​భోజనం చేసిన తర్వాత పది నిమిషాల పాటు నడిస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. మొదటి 10 నిమిషాలు చేస్తూ ఆ తర్వాత రోజు రోజుకి ఆ సమయాన్ని మరింత పెంచుకుంటూ పోవచ్చు.