చిలగడదుంప.. వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. దీనిని కొందరు ఉడకబెట్టుకుని తింటే మరికొందరు కాల్చుకొని తింటూ ఉంటారు. దాంతోపాటు ఇంకా కొన్ని రకాల వంటలు కూడా చేసుకుని తింటూ ఉంటారు. మనకు శీతాకాలంలో మీ చిలగడదుంపలు మార్కెట్‌లో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. చిలగడదుంపలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి..ఇందులో విటమిన్ ఏ, బి6, సీ, డీ, మెగ్నీషియం, అధిక ఫైబర్ ఉంటుంది. అందుకే నిపుణులు చిలగడదుంపను మన డైట్ లో చేర్చుకోమని చెబుతున్నారు. మరి చిలగడదుంపను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అలాగే ఎటువంటి సమస్యలు నయం అవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చిలగడదుంపలో మన శరీరంలోని అంతర్గత అవయవాలకు ఆక్సిడేటివ్ ప్రమాదాన్ని తగ్గించే స్పోరామిన్స్ని ఉత్పత్తిచేసే ప్రత్యేక లక్షణం ఉంటాయి. అలాగే శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరరీ, యాన్తోసయానిన్ కూడా లభ్యం. ఇది ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి, దానివల్ల వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది. షుగర్ పేషెంట్స్ చిలగడ దుంపు తినకూడదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దీన్ని తినవచ్చు కానీ లిమిట్ గా తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ పేషెంట్స్‌కు మంచిది. చిలగడదుంపల్లో ఉండే అధిక కార్బోహైడ్రేట్‌లకు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే లక్షణం ఉన్నప్పటికీ ఫైబర్ కంటెంట్ ఈ ప్రాసెస్‌ను స్లో చేస్తుంది.
ఆంథోసైనిన్స్ అనే పాలీఫెనోలిక్ సమ్మేళనం ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది. టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగిస్తుంది. అలాగే ఈ చిలకడదుంప జీర్ణ వ్యవస్థకు ఎంతో బాగా పనిచేస్తుంది. చిలగడదుంపలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదేవిధంగా స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, ఆ సమయంలో ఎదురయ్యే సమస్యలను దూరం చేయడానికి చిలగడదుంప సహాయపడుతుంది. వీటిలో ఫైబర్, పాలీఫినాల్స్ వంటివి అధికంగా ఉంటాయి. వారానికి ఒకసారైనా చిలగడదుంప తినడం వల్ల మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చాలామందిలో మొటిమలు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతుంటాయి.
ఇలాంటి సమస్యలకు చిలగడదుంప చెక్ పెడుతుంది. చిలగడదుంపలో కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. చిలగడదుంపలో ఉండే యాంథోసైనిన్ క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. క్యాన్సర్‌కు దూరంగా ఉండాలంటే.. చిలగడదుంపు డైట్‌లో కచ్చితంగా చేర్చుకోవాలి. ఇందులోనే ఉండే బీటా కెరోటిన్ ఈసోఫేగల్ క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడే జీర్ణవ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల క్యాన్సర్లను నివారించడానికి తోడ్పడుతుంది. చిలగడదుంపలు తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. చిలగడదుంపలో ఉండే బీటా కెరోటిన్ కంటిచూపును మెరుగుపరిస్తాయి. చిలకడదుంప తినడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి.