Site icon HashtagU Telugu

Red Banana Health Benefits: హైబీపీ కంట్రోల్ లో ఉండాలంటే ప్రతిరోజు ఈ పండు తినాల్సిందే?

Red Banana Health Benefits

Red Banana Health Benefits

చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఇష్టపడే పండ్లలో అరటిపండు కూడా ఒకటి. అరటిపండ్లలో అనేక రకాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ రకాల అరటిపండ్లు ఉన్నాయి. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. పసుపు పచ్చవి, చక్కెరకేళి, కొండ అరటి పండ్లు, అమృతపాణి, ముకిరీ, కర్పూరం, కర్పూర చక్కెర కేళీ ఇలా కొన్ని రకాల అరటిపండ్లు మాత్రమే మనకు తెలుసు. అటువంటి వాటిలో ఎర్రటి పండ్లు కూడా ఒకటి. అయితే మనకు ఈ పండ్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ ఈ ఎర్రటి అరటిపండ్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఎర్రటి అరటి పండ్ల వల్ల కలిగే లాభాల గురించి ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వీటిలో పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. తగినంత ఫైబర్ కూడా ఉంటుంది. ఈ ఎర్రటి అరటి పనులలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వు, ఫైబర్, క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్ పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం విటమిన్ సి లాంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఎర్రటి అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. చిన్న అరటి మనకు రోజుకు అవసరమైన 9 శాతం పొటాషియంను అందిస్తుంది. పొటాషియంను హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. ఎర్రటి అరటిపండ్లలో లుటీన్, బీటా కెరోటిన్ అనే రెండు కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వయస్సు-సంబంధిత మచ్చల క్షీణ, కంటి సమస్యలు నుంచి లుటీన్ రక్షిస్తుంది. పసుపు అరటి పండుతో పోలిస్తే దీనిలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది.

బీటా కెరోటిన్ మన శరీరంలో విటమిన్‌ ఏ గా మారుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకం. ఎర్ర అరటిపండ్లలో కెరోటినాయిడ్స్, ఆంథోసైనిన్స్, విటమిన్ సి, డోపమైన్ వంటి ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఆంథోసైనిన్స్ ఆహారం తీసుకోవడం వల్ల కొరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదం 9 శాతం తగ్గుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు తింటే అనేక అనారోగ్యాల నుంచి రక్షణ లభిస్తుంది. ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బి6 పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. విటమిన్ సి ఇమ్యూనిటీ సిస్టమ్‌ కణాలను బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా పోరాడుతుంది. విటమిన్ బి6 రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అరటిపండు ప్రీబయోటిక్ ఆహారం. ఇవి పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. ఫ్రక్టోలిగోసాకరైడ్‌లు, ఇన్సులిన్‌లో ప్రీబయోటిక్ ఫైబర్‌లు ఉంటాయి. ఇవి షుగర్‌ పేషెంట్స్‌లో మలబద్ధకం, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడానికి సహాయపడుతాయి. ఎర్ర అరటిపండ్లలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి, ఇవి మీ బరువు తగ్గడానికి సహాయపడుతాయి. అరటిపండు తినడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది.