Golden Milk: ఈ పాలు రోజు తాగితే చాలు.. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు?

మనకు ఎప్పుడైనా జలుబు, దగ్గు,గొంతు నొప్పిగా ఉన్నప్పుడు వెంటనే ఇంట్లోని పెద్దవారు పసుపు పాలు తాగమని

  • Written By:
  • Publish Date - February 15, 2023 / 06:30 AM IST

మనకు ఎప్పుడైనా జలుబు, దగ్గు,గొంతు నొప్పిగా ఉన్నప్పుడు వెంటనే ఇంట్లోని పెద్దవారు పసుపు పాలు తాగమని చెబుతూ ఉంటారు. పసుపు పాలు తాగినప్పుడు వెంటనే మనకు కొంచెం ఉపశమనంగా అనిపిస్తూ ఉంటుంది. పసుపు పాలను గోల్డెన్‌ మిల్క్‌ అని కూడా పిలుస్తారు. ఈ గోల్డెన్‌ మిల్క్ ప్రతిరోజూ తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాగా పసుపులో విటమిన్లు, మినరల్స్‌, మాంగనీస్‌, ఇనుము, పీచు, విటమిన్‌ బి6, కాపర్‌, పొటాషియం ఉంటాయి. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌ లక్షణాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. కాగా యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అధయనాలు చెబుతున్నారు.

గోల్డెన్‌ మిల్క్‌లో ఉండే దాల్చిన చెక్క, అల్లంలోనూ యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు ఉంటాయి. గోల్డెన్ మిల్క్‌లోని పదార్థాలకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. అల్లం, దాల్చినచెక్క, పసుపులోని కర్కుమిన్‌కు యంటీఇన్‌ఫ్లమేషన్‌ గుణాలు ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి గోల్డెన్‌ మిల్క్‌ ఔషధంలా పనిచేస్తుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్‌ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడే రోగులకు ఔషధాల కంటే పసుపు సమర్థంగా పని చేస్తాయి. గోల్డెన్ మిల్క్ మెదడుకు కూడా మంచిది. పసుపులో ఉండే కర్కుమిన్‌ మెదడులో ఉత్పన్నమయ్యే న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ స్థాయిలను పెంచుతుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు లివర్‌ పనితీరును మెరుగుపరుస్తాయి. కొన్ని రకాల వ్యాధులకు దీర్ఘకాలంపాటు వాడే ఔషధాలు కాలేయం మీద దుష్ప్రభావాన్ని చూపుతాయి.

అలాంటి వాటి నుంచి లివర్‌ పసుపు రక్షిస్తుంది. ఫ్యాటీ లివర్‌ నియంత్రణకు పసుపు ఉపయోగపడుతుంది. గోల్డన్‌ మిల్క్‌లోని అల్లం, దాల్చినచెక్క రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. దాల్చిన చెక్కలో ఉండే క్రోమియం శరీరంలోని గ్లూకోజ్ స్థాయుల్ని న్యూట్రల్‌ చేస్తుంది. దాల్చినచెక్కలో యాంటీ డయాబెటిక్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దాల్చిన చెక్కలో ఉండే పాలీఫెనాల్స్‌ గ్లూకోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాయులను తగ్గిస్తాయి. అల్లంలో అల్లంలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లు తమ బ్లడ్ షుగర్ లెవెల్స్‌‌ని అదుపులో, స్థిరంగా ఉంచుకోవడంలో సహాయపడతాయి. అల్లం శరీరంలోని వ్యర్థాలనూ తొలగిస్తుంది.