Site icon HashtagU Telugu

custard apple health benefits: వామ్మో.. సీతాఫలం వల్ల అన్ని రకాల ప్రయోజనాల?

Custard Apple

Custard Apple Health Benefits

సీతాఫలం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. మనకు ఎక్కువగా వర్షాకాలంలో వినాయక చవితి పండుగ సమయంలో ఈ సీతాఫలం మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు సీతాఫలంను ఎంతగానో ఇష్టపడతారు. ఈ పండు టేస్ట్‌లోనే కాదు, పోషకాలూ అద్భుతంగా ఉంటాయి. దీనిలో సి-విటమిన్‌తో పాటు ఎ, బి, కె విటమిన్లూ, ప్రొటీన్లూ, కాల్షియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌ వంటి మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.

సీతాఫలం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. సీతాఫలంలో విటమిన్‌ ఏ పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లు కంటి చూపును మరింతగా మెరుగు పరుస్తుంది. ఇది మన చర్మం,జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. సీతాఫలంలో మెగ్నీషియం, సోడియం, పొటాషియం మెండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. సీతాఫలంలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది.

ఇది ఐరన్‌ లోపాన్ని దూరం చేసి, హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. అనిమియా సమస్యతో బాధపడేవారు ఈ పండు తింటే చాలా మంచిది. సీతాఫలంలో ఉండే విటమిన్‌ బి6 కడుపుబ్బరం, అజీర్తి, అల్సర్లు వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు సీతాఫలం తింటే మేలు జరుగుతుంది.వంద గ్రాముల సీతాఫలంలో 94 క్యాలరీలు ఉంటాయి.. సన్నగా, పీలగా ఉన్నవారు హెల్తీగా బరువు పెరగాలంటే సీతాఫలం తింటే మంచిది. నీరసంగా ఉన్నప్పుడు సీతాఫలం తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది. సీతాఫలంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.మెగ్నీషియం శరీరంలో నీటి సమతుల్యతకు సహాయపడుతుంది. ఇది ఆర్థరైటిస్, రుమాటిజం లక్షణాలను తగ్గిస్తుంది. సీతాఫలంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.