Site icon HashtagU Telugu

Fasting: ఉపవాసం ఉండడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Fasting

Fasting

సాధారణంగా మనం ఇంట్లో ఏదైనా పూజ జరుగుతున్నప్పుడు లేదంటే ఫెస్టివల్స్ సమయంలో మరి కొన్ని సందర్భాలలో ఉపవాసం ఉంటాం. ఇదివరకటి రోజుల్లో కనీసం వారానికి ఒక్కసారైనా కూడా ఉపవాసం ఉండడం వల్ల భయంకరమైన వైరస్ లు దరిచేరకుండా ఉంటాయని నమ్మేవారు. కానీ ప్రస్తుత జనరేషన్ వారు ఉపవాసం అంటే అమ్మ ఉపవాసం మా వల్ల కాదు బాబోయ్ అని అనేస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఉపవాసం ఉండటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అదేంటా అని ఆశ్చర్యపోతున్నారా! మీరు విన్నది నిజమే. మరి ఉపవాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వారంలో కనీసం ఒక్క రోజైనా ఉపవాసం ఉండడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. మరి ముఖ్యంగా శరీరంలోని జీర్ణ క్రియ ఉత్తేజితం అవుతుంది. ఉపవాసంతో శరీరాన్ని శుభ్రపరచడం, బరువు తగ్గడం, రక్తపోటును నివారించడం లాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఉపవాసం వల్ల ఆరోజుకు కావాల్సిన శక్తిని కొవ్వుకణాలను కరిగించి బాడీ తీసుకుంటుంది. దీంతో చెడు కొలెస్ర్టాల్ తగ్గుతుంది. కానీ వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మాత్రం దీర్ఘ కాలిక ఉదర వ్యాధులకు కారణం అవుతుంది. కాబట్టి వారానికి కేవలం ఒక్కసారి మాత్రమే ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే బాడీకి కావాలసిన పోషకాలు కూడా అందుతాయి.

ఉపవాసం తో ఇన్సులిన్ సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది. ఈట్ స్టాప్ ఈట్ విధానంలో ఉపవాసం ఉన్న సమయంలో కణాలు సెల్యులార్ రిపేర్ చేసుకుంటాయి. ఇది ఆటోఫాగి కలిగి ఉంటుంది. దీనికి తోడు జీర్ణ వ్యవస్థ కూడా మెరుగువుతుంది. ఉపవాసంతో హార్మోన్లు కూడా క్రమ పద్ధతిలో విడుదలై హార్మోన్ లోపం లేకుండా కణాల పని తీరు మెరుగవుతుంది. ఇన్సులిన్ తగ్గడం గ్రోత్ హార్మోన్ స్థాయిలను పెంచడంతో పాటు, కొవ్వును కరిగించుకునే హార్మోన్ నోర్ ఫైన్ ఫ్లైన్ విడుదలను కూడా పెంచుతుంది. దీని వల్ల జీర్ణక్రియ రేటు వృద్ధి చెందుతుంది.