Tulasi Water: నీళ్లలో తులసి ఆకులు వేసుకొని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?

భారతీయులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా తులసి మొక్కకు భక్తి శ్రద్ధలతో పూజలు కూ

  • Written By:
  • Publish Date - September 1, 2023 / 10:30 PM IST

భారతీయులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా తులసి మొక్కకు భక్తి శ్రద్ధలతో పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయితే తులసి మొక్క వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా, అలాగే అందానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా తులసిని మూలికల రాణి అని కూడా పిలుస్తారు. దీనిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. తులసిలో విటమిన్‌ ఏ, విటమిన్‌ డి, ఐరన్, ఫైబర్‌, ఆల్సోలిక్‌ యాసిడ్, యూజినాల్ వంటి పోషకాలు ఉన్నాయి. తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.

తులసి ఆకులను రోజూ నీళ్లలో వేసుకుని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి తులసి మొక్కను నీటిలో వేసుకొని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. డయాబెటిస్ ఉన్నవారికి ఈ తులసి నీరు చక్కటి ఔషధంగా పనిచేస్తాయని చెప్పవచ్చు. తులసి ఆకులు హైపోగ్లైసీమిక్‌ స్థాయి నియంత్రణ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించడంలో సహాయపడతాయి. దీని కోసం మీరు గుప్పెడు తులసి ఆకులను తీసుకొని రాత్రంతా ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. తర్వాత ఉదయం ఖాళీ కడుపుతో ఆకులు నములుతూ నీళ్లు తాగేయాలి. ఇలా చేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. అదేవిధంగా తులసిలో యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి.

ఇవి నోటి ఇన్ఫెక్షన్‌లను ఎదుర్కోవడానికి, మొత్తం నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. తులసి నీటితో పుక్కిలించడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.ఈ నీరు శరీర ఒత్తిడిని తగ్గిస్తాయి. నీటిలో తులసి ఆకులు వేసుకుని తాగింతే స్ట్రెస్‌ తగ్గి మీకు ప్రశాంతతను అందిస్తుంది. తులసి నీళ్లు తాగితే ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి. తులసిలో ఫ్లేవనాయిడ్స్‌, పాలీఫెనాల్స్‌ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ నుంచి శరీర కణాలను రక్షిస్తాయి, తద్వారా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు డయాబెటిస్‌, క్యాన్సర్ గుండె సమస్యల ముప్పును తగ్గిస్తాయి.​