Site icon HashtagU Telugu

Black Pepper: ప్రతిరోజు మిరియాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?

Black Pepper

Black Pepper

మామూలుగా ప్రతి ఒక్కరి వంటగదిలో మిరియాలు అన్నవి తప్పనిసరిగా ఉంటాయి. మిరియాలను అనేక రకాల వంటలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఎటువంటి వంటకంలో మిరియాలు ఉపయోగించినా కూడా వంటకానికి డబుల్ టేస్ట్ ను అందిస్తాయి. మిరియాల రసం అయితే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. జలుబు చేసినప్పుడు ఇదే గొప్ప మెడిసిన్‌లా పని చేస్తుంది. మిరియాలు కేవలం ఇప్పటినుంచి మాత్రమే కాకుండా ఎప్పటినుండో ఉపయోగిస్తూనే ఉన్నారు. ఈ మిరియాల వల్ల ఎన్నో రకాల లాభాలు కూడా ఉన్నాయి. వీటిలో మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్‌ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.

వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మిరియాలను మన రోజూవారీ డైట్‌లో కొంచెం చేర్చుకున్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మిరియాల్లోని పెపరిన్‌ అనే రసాయనం ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయులు పెరగవు. ఫలితంగా డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు తక్కువ. మిరియాలు తీసుకోవడం వల్ల విటమిన్లు బి , సి , సెలీనియం, బీటా-కెరోటిన్ వంటి అవసరమైన పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. ఎందుకంటే నల్ల మిరియాలలో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఈ పోషకాల జీవ లభ్యతను పెంచుతుంది.

అవి శరీరం బాగా ఉపయోగించబడుతున్నాయని నిర్ధారిస్తుంది. బెర్రీలు, వేరుసెనగలో ఉండే రెస్‌వెరాట్రాల్‌ వంటి ప్రయోజనకర పదార్థాలను మెరుగ్గా శోషించుకునే సామర్థ్యం మిరియాల వల్ల మన శరీరానికి అందుతుంది. గుండె జబ్బు, క్యాన్సర్‌, అల్జీమర్స్‌, డయాబెటిస్‌, వంటి రుగ్మతల నుంచి రెస్‌వెరాట్రాల్‌ రక్షిస్తుంది. అయితే పేగులు శోషించుకునేలోగానే ఈ పదార్థం విచ్ఛిన్నమవుతుంటుంది. ఈ నల్ల మిరియాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఉబ్బరం, గ్యాస్ , మలబద్ధకం వంటి సాధారణ జీర్ణ సమస్యలను నివారిస్తుంది. ఇది ఆహారం నుంచి అవసరమైన పోషకాలను శరీరం సమర్ధవంతంగా గ్రహించడానికి సహాయపడుతుంది. మొత్తం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచడానికి, చెడు బ్యాక్టీరియాను తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి. అధిక ఆకలిని నియంత్రిస్తాయి. మిరియాలలోని పైపెరిన్‌, యాంటీఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఇది శరీరంలో ప్రో-ఇన్‌ఫ్లమేటరీ పదార్థాల ఉత్పత్తిని నిరోధిస్తుంది. మిరియాలు ఆర్థరైటిస్, ఆస్తమా, వాపు వంటి సమస్యలను తగ్గిస్తుంది. నల్ల మిరియాలు జీవక్రియను మెరుగుపరుస్తారు, తద్వారా కొవ్వు విచ్ఛిన్నం అవుతుంది. దీంతో బరువు కంట్రోల్‌లో ఉంటుంది. పైపెరిన్ థర్మోజెనిసిస్‌ను మెరుగుపరుస్తుంది.