Side Effects Of Lip Stick : హలో… లిప్ స్టిక్ వాడకం తగ్గించు…లేదంటే..!!!

కొంతమంది ఆడవాళ్లు...సందర్భం ఏదైనా సరే...లిప్ స్టిక్ పెట్టాల్సిందే. ఏ కలర్ లిప్ స్టిక్ పెడితే పెదాలు బాగుంటాయి...

  • Written By:
  • Publish Date - March 28, 2022 / 08:00 PM IST

కొంతమంది ఆడవాళ్లు…సందర్భం ఏదైనా సరే…లిప్ స్టిక్ పెట్టాల్సిందే. ఏ కలర్ లిప్ స్టిక్ పెడితే పెదాలు బాగుంటాయి…అందంగా కనిపిస్తాయి…ఇదే లోకంలో ఉంటారు. డ్రెస్సుకు తగ్గట్లుగా జ్యువెల్లరితోపాటు..లిప్ స్టిక్ కూడా రుద్దాల్సిందే. కానీ పెదాలను అందంగా మార్చే ఈ లిప్ స్టిక్ మీ ఆరోగ్యానికి ఎంత డేంజరో తెలిస్తే..షాక్ అవుతారు. ఆడాళ్లవాళ్లకు మేకప్ కిట్ తో వీడదీయలేని బంధం ఉంటుంది. లిప్ స్టిక్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. లిప్ స్టిక్ లేనిదే అడుగు బయటకు పెట్టనివారు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది 24గంటల దాటినా…పెదాలకు లిప్ స్టిక్ అలాగే ఉంటుంది. లిప్ లిస్ట్ గురించి కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకుంటే దాని జోలికి అస్సలు వెళ్లరు. పెదాలకు రంగులు రుద్దుతె ఎన్ని సైడ్ ఎఫెక్ట్ ఉంటాయో తెలుసుకుందాం.

లిప్ స్టిక్ లో కెమికల్స్…
*లిప్ స్టిక్ లో క్రోమియం, మెగ్నీషియం, లెడ్, కాడ్మియం, పెట్రోకెమికల్స్ ఉపయోగిస్తారు. ఇన్ని కెమికల్స్ తో తయారైన లిప్ స్టిక్ పెదాలకు రుద్దుతే..అవి శరీరంలోని వెళ్లే అవకాశం ఉంటుంది. కాడ్మియం అనే కెమికల్ వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. కడుపులో కణితులు కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
*లెడ్ కమికల్ వల్ల నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వంధత్వం, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.
* లిప్ స్టిక్ లో ఉండే కెమికల్స్ క్యాన్సర్ బారిన పడేసే అవకాశం ఉంటుంది. ఇందులో కలిపే పెట్రో కెమికల్ వల్ల తెలితేటలు మందగిస్తాయి. పునురుత్పత్తి వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. శారీరక ఎదుగుదల కూడా ఆగిపోయే ప్రమాదం ఉంటుందట.
* చర్మంపై దద్దుర్లు రావడం, శ్వాసలో ఆటంకం ఏర్పడుతుంది. లిప్ స్టిక్ లో వాడే బిస్మత్ ఆక్సీక్లోరైడ్..పారా బెన్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ రసాయనాల వల్ల శారీరంలో ఉండే అవయవాలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు.

పెదాలను అందంగా మార్చే లిప్ స్టిక్ తో ఎలాంటి ప్రమాదం ఉందో తెలిసింది కదా…ఇప్పటికైనా వాటికి దూరంగా ఉండటం మంచిది.