Water For Good Health: రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి.. ఎక్కువ తాగితే ప్రమాదమా?

నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్న విషయం తెలిసిందే. వైద్య నిపుణులు కూడా శరీరానికి సరిపడినంత

  • Written By:
  • Publish Date - August 28, 2022 / 08:20 AM IST

నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్న విషయం తెలిసిందే. వైద్య నిపుణులు కూడా శరీరానికి సరిపడినంత నీటిని తాగమని చెబుతూ ఉంటారు. లేదంటే డిహైడ్రేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని ముందుగానే హెచ్చరిస్తూ ఉంటారు. అయితే నీటిని మోతాదుకు మించి కూడా తాగకూడదట. నీళ్లు తాగితే వచ్చే ఆరోగ్య సమస్యల గురించి పక్కన పెడితే మోతాదుకు మించి నీళ్లు తాగితే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయట.. మరి రోజుకి ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? మోతాదుకు మించి తాగితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో?ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రతి మనిషి శరీరంలో 65 శాతం నీరు ఉంటుంది. కాగా శరీర బరువులో సగం నీరు శాతం ఉంటుంది అని చెప్పవచ్చు. వయసు రీత్యా నీటి పరిమాణంలో కూడా మార్పులు ఉంటాయి. పెద్దల విషయానికి వస్తే వారి శరీరంలో 65% నీరు ఉంటుంది. ఇక పిల్లల్లో 80 శాతం వృద్ధుల్లో 50% నీరు ఉంటుంది. నీరు శరీర నిర్మాణానికి ఉపయోగపడటంతో పాటు అనేక వ్యాధులను కూడా దరిచేరకుండా చేస్తాయి. ఇక ప్రతిరోజు ఒక వ్యక్తి ఇన్ని లీటర్ల నీరు తీసుకోవాలి అన్న విషయానికి వస్తే.. సాధారణంగా శరీర బరువును బట్టి నీరు తాగాల్సి ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తి 20 కిలోల బరువును బట్టి ఒక లీటర్ నీటిని తాగాలి అని పరిశోధనలో వెల్లడయ్యింది. ఉదాహరణకు 70 కిలోల బరువు ఉంటే అలాంటివారు 3.5 లీటర్ల నీటిని తాగాలి.

ఒకవేళ 80 కేజీలు ఉంటే నాలుగు లీటర్ల నీటిని తాగాలి. అయితే ఒక మహిళ ప్రతిరోజు 11.5 కప్పుల నీటిని తాగాలి. అనగా 2.0 లీటర్లు అనగా 2.7 లీటర్లు.. అదేవిధంగా ఒక పురుషుడు 15.5 కప్పుల నీరు తాగాలి. అనగా 3.7 లీటర్ల నీటిని తాగాలి. మోతాదు మించి నీరు తాగడం వల్ల శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అదేవిధంగా అనేక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. గుండె, మూత్రపిండాలు సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తలనొప్పి వికారం కండరాల నొప్పులు వంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి.