Site icon HashtagU Telugu

TEA: రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలి? ఖాళీ కడుపుతో టీ తాగవచ్చా?

TEA

TEA

TEA: శీతాకాలంలో వేడి వేడి టీ (TEA) తాగడం ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. వేడి టీ సిప్స్ తీసుకుంటుంటే శరీరంలోని చలి అంతా పోయినట్లు అనిపిస్తుంది. అయితే చలికాలంలో టీ తాగడం ముఖ్యంగా పాల టీ తాగడం ఎంత ఇష్టమైనప్పటికీ.. మీరు ఎంత కావాలంటే అంత టీ తాగడం అస్సలు మంచిది కాదు.

వైద్యుల నిపుణుల ప్రకారం.. రోజుకు ఎంత మోతాదులో టీ తాగుతున్నారో దానిపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరమని అంటున్నారు. రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలి అనే విషయాన్ని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Suriya: సూర్య 47వ సినిమా కూడా తెలుగు డైరెక్టర్‌తోనేనా? వారితో చర్చలు!

రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలి?

శీతాకాలంలో ప్రజలు మసాలా టీ తాగడానికి చాలా ఇష్టపడతారు. ఈ మసాలా టీని పాలు, టీ ఆకులు, చక్కెరతో పాటు అల్లం, యాలకులు, లవంగాలు వేసి తయారుచేస్తారు. ఈ మసాలాలు యాంటీ-ఆక్సిడెంట్లు, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలతో నిండి ఉంటాయి. అయితే ఈ టీకి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. పాల టీలో టానిన్‌లు ఉంటాయి. ఇవి శరీరంలో ఐర‌న్‌ శోషణను తగ్గిస్తాయి. దీనిలో అవసరానికి మించి చక్కెర కలిపితే అధిక రక్తపోటు, అధిక రక్త చక్కెర వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా ఇది జీర్ణక్రియకు అంత మంచిది కాదు.

ఈ నేపథ్యంలో నిపుణుల సలహా ఏమిటంటే.. ఈ టీని అవసరానికి మించి తాగవద్దు. ఎక్కువ చక్కెర కలపవద్దు. భోజనాన్ని టీతో కలిపి తీసుకోకూడ‌దు. అందుకే రోజుకు 1 నుండి 2 కప్పుల పాల మసాలా టీ మాత్రమే తాగాలి. దీని కంటే ఎక్కువ తాగితే ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది.

ఖాళీ కడుపుతో టీ తాగవచ్చా?

చాలా మంది ఉదయం లేవగానే టీ తాగి రోజును ప్రారంభిస్తారు లేదా ఖాళీ కడుపుతో పాల టీ తాగుతారు. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగకూడదని వైద్య నిపుణులు సూచించారు. ఖాళీ కడుపుతో టీ తాగితే యాసిడిటీ సంబంధిత సమస్యలు రావచ్చు. దీని వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాదు ఎక్కువ టీ తాగడం లేదా ఖాళీ కడుపుతో తాగడం వలన మైగ్రేన్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు టీ తాగిన వెంటనే లేదా టీతో పాటుగా ఏదైనా తినకూడదు. టీ తాగిన ఒక గంట తర్వాత మాత్రమే ఏదైనా తినాలి. ఎందుకంటే టీతో పాటు ఏదైనా తింటే దానిలోని పోషకాలు సరిగా శరీరంలో శోషించబడవు.

రోజును ఎలా ప్రారంభించాలి?

ఖాళీ కడుపుతో టీ తాగే బదులు ఇంటి వద్ద తయారుచేసిన డ్రై ఫ్రూట్స్, విత్తనాల మిశ్రమంతో రోజును ప్రారంభించవచ్చు. 2 బాదం, 2 వాల్‌నట్స్, 2 కిస్‌మిస్, పిస్తా, చియా విత్తనాలు, గుమ్మడి గింజలను కలిపి తినవచ్చు.

 

Exit mobile version