Sesame Seeds: చలికాలంలో నువ్వులు చేసే మేలు తెలిస్తే.. తినకుండా అస్సలు ఉండలేరు?

నువ్వులు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. నువ్వులను అనేక స్వీట్ల

Published By: HashtagU Telugu Desk
Sesame Seeds

Sesame Seeds

నువ్వులు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. నువ్వులను అనేక స్వీట్ల తయారీలతోపాటు అనేక వంటకాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నువ్వులు ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చడంతో పాటుగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి. అయితే చలికాలంలో నువ్వులు తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో నువ్వులను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. నువ్వులు తినడానికి రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

నువ్వుల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. శీతాకాలంలో నువ్వుల లడ్డూలు నువ్వులతో తయారు చేసిన ఆహార పదార్థాలు తినడం మంచిది. నువ్వులు చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. నువ్వులలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. వీటిలో మెగ్నీషియం, ఫాస్పరస్ లాంటి పోషకాలు లభిస్తాయి. నువుల్లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. అలాగే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. నువ్వులలో ఉండే మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో ఎంతో బాగా సహాయపడుతుంది. బీపీ రోగులు వైద్యులను సంప్రదించిన తర్వాత నువ్వులు తీసుకోవడం మంచిది.

కాగా నువ్వులు సెసమిన్, సెసామోలిన్ వంటి మూలకాలను కలిగి ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది. నువ్వులలో ప్రోటీన్, ఐరన్, మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలు ఉన్నాయి. చలికాలంలో వీటిని రోజూ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నువ్వుల వినియోగం మెదడుకు కూడా మేలు చేస్తుంది. నువ్వుల్లో ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్, ఇతర మినరల్స్‌తో పాటు విటమిన్ ఇ వంటివి సమృద్ధిగా లభిస్తాయి.

  Last Updated: 06 Jan 2023, 07:04 PM IST