Site icon HashtagU Telugu

Apple Peel: యాపిల్ పై తొక్క తీసి తింటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!

Apple Peel

Apple Peel

ప్రతిరోజు ఒక యాపిల్ తింటే వైద్యుల దగ్గరికి వెళ్లాల్సిన పనిలేదు అని అంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతిరోజు ఒక యాపిల్ ని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. యాపిల్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అయితే యాపిల్ తినేటప్పుడు కొంతమంది పైన తొక్క తీసేసి తింటే మరి కొందరు తొక్కతో అలాగే తింటూ ఉంటారు. మరి యాపిల్ తొక్క తీసి తింటే ఏం జరుగుతుంది? అలా తినవచ్చా తినకూడదా? ఇప్పుడు మనం తెలుసుకుందాం..రోజూ ఒక ఆపిల్ తింటే శరీరంలోని అన్ని వ్యాధులు దూరం అవుతాయట.

కానీ మీరు ఆరోగ్యకరమైన ఆపిల్ తొక్కలను తొక్కతీసి తింటే, మీరు దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందలేరు అని అవుతున్నారు. ఎందుకంటే ఆపిల్ తొక్కలో అవసరమైన పోషకాలన్నీ ఉంటాయట. వీటిని తొక్క తీయడం వల్ల యాపిల్స్ లో ఉండే పోషకాలు తగ్గిపోతాయని చెబుతున్నారు. అలాగే యాపిల్స్ లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయట. దీని కారణంగా ఈ పండును ప్రతి సీజన్లో ఎక్కువగా తింటారు. కానీ ఆపిల్స్ పై మైనం, పురుగుమందుల నష్టాన్ని నివారించడానికి, చాలా మంది దాని తొక్కను తొలగిస్తారు. దీని వల్ల యాపిల్స్ వల్ల కలిగే ప్రయోజనాలు తగ్గుతాయి. ఆపిల్ పండ్లను తొక్కతో తినడం వల్ల ఎక్కువ ప్ర‌యోజ‌నాలు ఉంటాయట.

ఆపిల్ తొక్కతో తింటే అందులో ఉండే ఫైబర్ లభిస్తుందట. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. అలాగే కాలేయ ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఆపిల్ ను తొక్కతో తింటే అందులో ఉండే ఫైబర్ డయాబెటిస్ లో ఆకలిని నియంత్రించి జీర్ణక్రియను సరిచేస్తుందట. ఆపిల్ తొక్కలో క్వారెక్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పని చేస్తుంది. ఇది ఊపిరితిత్తులను, గుండెను అనేక వ్యాధుల నుండి రక్షిస్తుందట. ఆపిల్ తొక్కలో ఉండే పాలీఫెనాల్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు రక్తపోటును తగ్గిస్తాయని చెబుతున్నారు. దీనివల్ల గుండెలోని సిరలు మృదువుగా ఉండి వాటిలో ఎలాంటి అడ్డంకులు ఉండవట.

దీనివల్ల గుండె జబ్బులు దరిచేరవట. ఆపిల్స్ తొక్కతీసి తినడం వల్ల కొద్దిసేపటికే ఆకలిగా అనిస్తుంది. ఆపిల్ తొక్కతో తింటే తృప్తిని ఇచ్చి ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుందట. దీని వల్ల మీరు తక్కువ కేలరీలు తీసుకుంటారు. అది బరువు తగ్గడానికి సహాయపడుతుందట. అదే సమయంలో, ఆపిల్ తొక్కలలో ఉండే పాలీ ఫెనాల్స్ కొవ్వును గ్రహించడానికి , బ‌రువు తగ్గడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా యాపిల్స్ తొక్కలో విటమిన్ ఏ అలాగే విటమిన్ సి, విటమిన్ కేలు ఉంటాయి. వీటితో పాటుగా పొటాషియం ఫాస్ఫరస్ క్యాల్షియం కూడా ఉంటాయి.

ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. యాపిల్ తొక్కలు తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆపిల్ పండ్లను తొక్కలతో తినేముందు వాటిని శుభ్రంగా క‌డ‌గాలి. ఆపిల్ పై మైనపు పూత ఉన్న‌ట్టు క‌నిపిస్తే దానిని తొల‌గించ‌డానికి ఒక పెద్ద పాత్రలో ఒక లీటరు నీటిని తీసుకుని అందులో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా కలపాలి. అందులో ఉప్పు కలపాలి. ఇప్పుడు ఈ గోరువెచ్చని నీటిలో ఆపిల్ వేసి అరగంట పాటు అలాగే ఉంచాలి. అరగంట తర్వాత ఆపిల్ ను నీళ్లలో నుంచి బయటకు తీసి కడిగేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆపిల్ తినడానికి పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.