Chickpeas: వామ్మో.. శనగలు తినడం వల్ల ఏకంగా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తరచుగా శనగలు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి శనగలు తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Published By: HashtagU Telugu Desk
Chickpeas

Chickpeas

శనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. శనగలు తరచుగా తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వీటిని డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల అనేక రకాల లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. శనగల్లో ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. శనగలను తింటే మనం ఎన్నో అనారోగ్య సమస్యలు దూరంగా ఉంటాయట. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ కడుపును తొందరగా నింపుతాయట.

దీంతో మీరు బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. అయితే ఇందుకోసం మీరు వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తినవచ్చట. శనగల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తింటే మీ కడుపు తొందరగా నిండుతుందట. దీంతో మీరు అతిగా తినలేరు. శనగల్లో మెగ్నీషియం కూడా బాగా ఉంటుంది. ఇది మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందట. శనగలను తింటే మన చర్మం హైడ్రేట్ గా ఉంటుందట. అలాగే కొల్లాజెన్ కూడా బాగా ఏర్పడుతుందట. దీంతో చర్మ సమస్యలు తగ్గిపోతాయని,ముడతలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు. శనగల్లో ఫైటోన్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.

ఇది మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుందట. వీటిని తరచుగా మీ డైట్ లో చేర్చుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట. అలాగే శనగల్లో ఐరన్ కూడా మెండుగా ఉంటుంది. ఇది మన శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచుతుందట. మీకు రక్తహీనత సమస్య ఉంటే శనగలను తినడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ శనగలు కొత్తగా తల్లి అయిన వారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయట. వీటిని నానబెట్టి తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. అయితే మాంసం తినని వారు ఈ శనగలను తింటే మాంసంలో దొరికే ప్రోటీన్ సెనగల్లో లభిస్తుందని చెబుతున్నారు.

  Last Updated: 04 Mar 2025, 04:34 PM IST