Cardamom side effects : ఏలకులు అతిగా వాడితే.. ఈ సైడ్ ఎఫెక్ట్స్

Cardamom side effects : ఏలకులు (ఇలాచీ)..  ప్రజలు ఎంతో ఇష్టపడి తినే మౌత్ ఫ్రెషనర్.. ఇవి ఆహారానికి రుచి, సువాసనను కూడా జోడిస్తాయి. శతాబ్దాలుగా భారతీయ వంటకాల్లో ఏలకులను ఉపయోగిస్తున్నారు. రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వీటివల్ల కలుగుతాయి. అయితే ఏలకులు అధికంగా తీసుకుంటే కొన్ని నష్టాలు కలుగుతాయి.

Published By: HashtagU Telugu Desk
Cardamom Side Effects

Cardamom Side Effects

Cardamom side effects : ఏలకులు (ఇలాచీ)..  ప్రజలు ఎంతో ఇష్టపడి తినే మౌత్ ఫ్రెషనర్.. ఇవి ఆహారానికి రుచి, సువాసనను కూడా జోడిస్తాయి. శతాబ్దాలుగా భారతీయ వంటకాల్లో ఏలకులను ఉపయోగిస్తున్నారు. రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వీటివల్ల కలుగుతాయి. అయితే ఏలకులు అధికంగా తీసుకుంటే కొన్ని నష్టాలు కలుగుతాయి. ఏలకుల అతి వినియోగం వల్ల కలిగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్(Cardamom side effects) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.అలర్జీ రియాక్షన్స్ 

సహజ మౌత్ ఫ్రెషెనర్‌గా ప్రజలు వినియోగించే ఏలకులు కొందరిలో అలర్జీ రియాక్షన్స్ ను కలిగిస్తాయి. పలువురిలో దురద, దద్దుర్లు, ముఖం వాపు, గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ప్రాబ్లమ్స్ కూడా కలుగుతాయి. మీరు కూడా ఏలకులు తిన్నాక.. వీటిలో ఏవైనా  ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

2. జీర్ణశయాంతర ఆటంకాలు

ఏలకులు ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ సంబంధిత సమస్యలు వస్తాయి. కొంతమందిలో కడుపు నొప్పి, అజీర్తి, ఉబ్బరం, అతిసారం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలను నివారించడానికి ఏలకులను మితంగా తీసుకోవడం మంచిది.

3. లో బీపీ 

ఏలకులు హైపో టెన్సివ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి అతిగా తింటే రక్తపోటును తగ్గిస్తుంది.. అంటే బీపీ డౌన్ అవుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇలాచీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక  బీపీ తక్కువగా ఉన్నవారు మాత్రం ఏలకులను తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Also read : Jaundice Diet: కామెర్లు వస్తే ఏయే ఫుడ్స్ తినాలి ? ఏయే ఫుడ్స్ తినొద్దు?

4. ఇతర ఔషధాలతో రియాక్షన్  

ఏలకులలో కొన్ని రకాల మందులతో చర్య పొందే సమ్మేళనాలు ఉంటాయి. మీరు డయాబెటిస్ మందులు తీసుకుంటుంటే లేదా మరేదైనా మందులు తీసుకుంటుంటే.. ఎక్కువగా ఏలకుల తినొద్దు. ఫుడ్ ఐటమ్స్ లో వాటి వాడకం తగ్గించండి. మీ వైద్యుడి సలహాలతో జాగ్రత్తలు పాటించండి.

5. హార్మోన్లపై ప్రభావం

ఏలకులు ఈస్ట్రోజెనిక్ ప్రభావాలను కలిగి ఉండవచ్చని కొన్ని స్టడీ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇవి మన శరీరంలోని హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. రొమ్ము లేదా గర్భాశయ క్యాన్సర్ ఉన్న రోగులు హార్మోన్ సెన్సిటివ్‌గా ఉండొచ్చు. అలంటి వారు ఏలకులను జాగ్రత్తగా లేదా వైద్య సలహాపై మాత్రమే ఉపయోగించాలి.

గమనిక  : ఇందులో పేర్కొన్న సలహాలు, సూచనలు సాధారణ సమాచార ప్రయోజనం కోసం మాత్రమే. వృత్తిపరమైన వైద్య సలహాగా తీసుకోకూడదు. మీకు ఏవైనా ప్రశ్నలు లేదా ఆందోళనలు ఉంటే ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.

  Last Updated: 10 Jun 2023, 03:14 PM IST