Site icon HashtagU Telugu

Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఒక్క పండు తినాల్సిందే?

Mixcollage 10 Jun 2024 11 13 Am 1638

Mixcollage 10 Jun 2024 11 13 Am 1638

కాలం మారిపోవడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి కూడా మారిపోయాయి. దాంతో మనుషులు ఆరోగ్యం పై పూర్తి శ్రద్ధ వహించకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక ప్రస్తుత రోజుల్లో అయితే ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అందులో ఎక్కువ శాతం మంది మనుషులు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ సమస్య ఎక్కువ అయిపోయింది. ఈ కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి బయటపడడానికి చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

అయితే ఈ ఒక్క పండు తీసుకుంటే చాలు కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి అంటున్నారు వైద్యులు. ఇంతకీ ఆ పండు ఏదో ఆ పండును ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆ పండు మరేదో కాదు కివి. ఈ కివి పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కమలాపండు, ఆపిల్‌లో కన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలు ఇందులో ఉంటాయి. ఇది అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాలతో పోరాడడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. కివీ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైములు, విటమిన్ సి ఉంటాయి.

కివీ పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్, జింక్, నియాసిన్, రైబోఫ్లావిన్, బీటా కెరోటిన్ మొదలైన పోషకాలు ఉన్నాయి. శరీరం సక్రమంగా పనిచేయడానికి ఈ పోషకాలన్నీ అవసరం. కాగా ఇందులో కొవ్వులూ, సోడియం తక్కువగా ఉండటం వల్ల హృద్రోగులూ, మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఈ పండును హ్యాపీగా తినవచ్చు. అలాగే కివీ పండులోని యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాల వల్ల బీపీ, కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటాయి. కివీ పండ్లు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.

ఫైబర్ అధికంగా ఉండే కివీ పండు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. శ్వాస, ఆస్తమా వంటి సమస్యలను కివీ పండు తొలగిస్తుంది. గర్భిణీ స్త్రీలకు కివీ పండ్లను ఇస్తే మంచి పౌష్టికాహారం లభించడమే కాక బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. వివిధ రకాల ఆహార పదార్థాల నుంచి లభించే అనేక పోషకాలు ఒక్క కివీ పండు తినడం వల్ల కూడా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గుండె, మూత్రపిండాలు, కండరాలు, నరాలు సక్రమంగా పనిచేయడానికి పొటాషియం అవసరం. ఒక కివిలో 215 mg పొటాషియం ఉంటుంది. కివి వినియోగం మీ రక్తపోటు, నరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. అధిక రక్తపోటు, పక్షవాతం, మూత్రపిండాల్లో రాళ్లు, బోలు ఎముకల వ్యాధి వంటి గుండె సమస్యలను తగ్గించడంలో కివీ పండు ఉపయోగపడుతుంది. రోజూ రెండు మూడు కివీ పండ్లను తినడం వల్ల కీళ్లలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ కరిగి శరీరాన్ని నీరుగా మారుస్తుంది. అంతేకాకుండా కిడ్నీ స్టోన్ కూడా కరిగిపోతుంది.