Kitchen: కిచెన్ లోని ఈ వస్తువులు ప్రాణాలకు ప్రమాదమట.. అవేంటంటే?

మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో కిచెన్ తప్పకుండా ఉంటుంది. కిచెన్ లో వంటకు కావాల్సిన ఎన్నో రకాల వస్తువులను

  • Written By:
  • Publish Date - November 26, 2022 / 08:30 AM IST

మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో కిచెన్ తప్పకుండా ఉంటుంది. కిచెన్ లో వంటకు కావాల్సిన ఎన్నో రకాల వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మనకు కావాల్సిన వస్తువులు అన్నీ కూడా కిచెన్ లో పెడుతూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కిచెన్ లో ఉండే కొన్ని వస్తువులు ప్రాణాలకే ప్రమాదం. ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా.. మీరు విన్నది నిజమే. మరి ఎటువంటి వస్తువులు మన ప్రాణాలకు హాని కలిగిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొదటిది రిఫ్రిజిరేటర్.. ప్రస్తుత రోజుల్లో ఈ రిఫ్రిజిరేటర్ లేని ఇల్లు ఉండవేమో. పల్లెటూరి వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఈ ఫ్రిడ్జ్ ని ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. అయితే సాధారణంగా మనం వండిన మాంసాహారాలు కాయగూరలు అలాగే ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటాం. ఈ ఫ్రిడ్జ్ హానికరమైన, ప్రమాదకరమైన క్లోరో ఫ్లోరో కార్బన్స్ వంటి వాయువులను విడుదల చేస్తుంది.

ఈ వాయువులు ఓజోన్ పొర క్షీణతకు,భూతాపానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ వంటి వాటికి గురికావడం వల్ల తలనొప్పి, వణుకు,మూర్ఛ రావడం లాంటి సమస్యలు వస్తాయి. కొన్ని కొన్ని సార్లు సిఎఫ్ సి సమస్యలు గుండెపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి చాలా వరకు ఫ్రిడ్జ్ వాడకాన్ని తగ్గించడం ఎంతో మేలు. అలాగే మైక్రోవేర్ ని కూడా చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మైక్రోవేవ్ లో భోజనాన్ని వండుకోవడంతోపాటు కొన్ని రకాల పదార్థాలను వేడి చేసుకోడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే మైక్రోవేవ్ ఓవెన్‌ లు ఆహారాన్ని వేడి చేయడానికి,వండడానికి విద్యుదయస్కాంత వికిరణాన్ని ఉపయోగిస్తాయి. తరంగాలు తప్పించుకోని విధంగా ఉపకరణం తయారు చేయబడింది, అయితే ఈ రేడియేషన్‌ లకు గురైనప్పుడు అది తీవ్రమైన కాలిన గాయాలకు కారణం అవుతుంది. అలాగె చాలా మంది కిచెన్ లో అల్యూమినియం పాత్రలను వినియోగిస్తూ ఉంటారు. అల్యూమినియం పాత్రలలో వంట తొందరగా అవుతుందని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

కానీ అల్యూమినియం పాత్రలు ఆరోగ్యానికి హాని కలిగించే సీసం, కాడ్మియం వంటి రసాయనాల వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఈ పాత్రలు, రేకుల నుండి రసాయనాల వల్ల క్యాన్సర్ లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలామంది వంట గదిలో ఆహారాలు మరింత రుచిగా రావడం కోసం వంటల్లో ఎంఎస్జి ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఆహారాలలో ఈ మూడు గ్రాముల కంటే ఎక్కువ ఎం ఎస్ జి ని ఉపయోగించడం వల్ల రక్త పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అది గుండెపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది నూనె లేకుండా ఉడికించడం కోసం ఎయిర్ ప్రైస్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇవి ఎక్కువగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బంగాళదుంప వంటి పిండి పదార్థాలను గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వండడం వల్ల యాక్రిలామైడ్ వంటి ఏర్పడి అది క్యాన్సర్ కు దారి తీయవచ్చు.