Site icon HashtagU Telugu

Health Tips: వంటింట్లో దొరికే వాటితోనే జలుబు,దగ్గు సమస్యలకు చెక్ పెట్టవచ్చని తెలుసా?

Health Tips

Health Tips

మామూలుగా చాలామందికి సీజన్ తో సంబంధం లేకుండా జలుబు దగ్గు సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒక్కసారి ఈ జలుబు దగ్గు సమస్యలు వచ్చాయి అంటే చాలు కొన్ని రోజులపాటు అలాగే మనుషులను వేధిస్తూ ఉంటాయి. ఈ జలుబు దగ్గు తగ్గడానికి ఎన్ని రకాల మెడిసిన్స్ ఉపయోగించినా కూడా కొన్ని కొన్ని సార్లు ఉపయోగం లేకుండా పోతూ ఉంటుంది. ముఖ్యంగా చలికాలం మొదలైంది అంటే చాలు చాలామందికి జలుబు దగ్గు సమస్య మొదలవుతూ ఉంటుంది. అయితే ఈ దగ్గు జలుబు సమస్యతో ఇబ్బంది పడేవారు మన వంటింట్లో దొరికే కొన్ని రకాల వాటిల్ని ఉపయోగించి ఈజీగా తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇందుకోసం ఒక లీటర్ నీరు, అల్లం పొడి హాఫ్ టీ స్పూన్, అలాగే ఒక తాజా అల్లం ముక్క తీసుకోవాలి. తర్వాత నీటిని మరిగించి, అల్లం పొడి అల్లం మిశ్రమాన్ని అందులో వేసి పది నిమిషాల పాటు బాగా మరగబెట్టాలి. తద్వారా అల్లంలోని అన్ని పోషక పదార్ధాలు నీటిలో కలుస్తాయి. ఇప్పుడు దానిని గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆగి, ఆ తర్వాత తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దగ్గు జలుబు సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చట. అదేవిధంగా నిరంతరం దగ్గు సమస్యతో ఇబ్బంది పడేవారు పసుపు నీటితో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. పసుపు నీటితో నోటిని పుక్కిలించి బయటకు ఊయడం వల్ల మీరు జగ్గు జలుబు సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.

అయితే ఈ పసుపు నీటిని తయారు చేయడం కోసం ఒక టీ స్పూన్ పసుపు ఒక గ్లాసు నీరు తీసుకుని వాటిని స్టవ్ పై పెట్టి బాగా మరిగించి, పసుపు మొత్తం నీటిలో బాగా ఉడికిన తర్వాత నోటిలో పోసుకొని వాటిని పుక్కలించాలట. ఈ విధంగా రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు చేయడం వల్ల తొందరగా ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు. దగ్గు జలుబు సమస్య ఉన్నప్పుడు ఆవిరి పట్టడం వల్ల కూడా ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. అయితే ఇందుకోసం తులసి ఆకులతో కలిపిన నీటిని బాగా మరిగించి ఆవిరి పడటం వల్ల దగ్గు జలుబు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు. అదేవిధంగా దగ్గు జలుబు సమస్య ఉన్నవారు మిరియాల వాటర్ లేదంటే మిరియాల రసం వంటివి తీసుకోవడం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చునని చెబుతున్నారు. అల్లం పాలు, సొంటి కాఫీ వంటివి తీసుకోవడం వల్ల కూడా ఈ దగ్గు జలుబు సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చని చెబుతున్నారు.

note: పైన సమాచారంలో ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.