ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవనశైలి అలాగే ఇతర ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది బాణ లాంటి పొట్ట అధిక బరువు బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అధిక బరువు సమస్య కారణంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది వారి పనులు వారు స్వతహాగా చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అధిక బరువు తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు మంచి ఫలితాలు కనిపించవు. అయితే అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బరువు తగ్గడానికి తేనె ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇందుకోసం 1 టీ స్పూన్ తేనెను ఒక గ్లాసు నీటిలో కలపి ఆ తేనెను ఎప్పుడూ ఎక్కువగా వేడి ఉన్న నీటిలో కానీ లేదా చల్లగా ఉన్న నీటిలో కానీ కలిపి తినకూడదట. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిలో తేనె కలిపి తాగితే మంచిదని చెబుతున్నారు.
అలాగే నిమ్మకాయలో కూడా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మ కాయలో విటమిన్ సి ఎక్కుగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి, అనేక వ్యాధులను నివారించడానికి సహాయపడుతుందట. నిమ్మకాయ వినియోగం బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. ఇందుకోసం ఉదయం పూట గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయట.
పసుపు కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుందట. ఇందుకోసం గ్లాస్ నీటిలో చిటికెడు పసుపు కలిపి రోజూ ఉదయాన్నే తాగాలని చెబుతున్నారు. అంతేకాకుండా బరువు తగ్గడానికి కొన్ని విషయాల్ని కూడా గుర్తించుకోవాలట.
అలాగే బరువు తగ్గాలనుకునేవారు ముందు తినే తిండిపై దృష్టి పెట్టండి. ఏది పడితే అది తినడం వల్ల బరువు తగ్గకపోగా పెరిగే ప్రమాదం ఉందట. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు జంక్ ఫుడ్స్, వేయించిన ఆహారాలు, చక్కెర ఎక్కువగా ఉండే ఫుడ్స్ కి దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఆహారాలు తింటే శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోవడమే కాకుండా అనేక వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుందట.