Kidney Problems : మీరు కిడ్నీ సమస్య తో బాధపడుతున్నారా..? అయితే ఆయుర్వేద నిపుణులు చెప్పేవి పాటించండి

kidney problems avoid these foods

  • Written By:
  • Publish Date - October 17, 2023 / 01:31 PM IST

ఈరోజుల్లో చాలామంది కిడ్నీ సమస్య (Kidney Problem)లతో పోరాడుతున్నారు. మనిషి శరీరంలో కిడ్నీలు అనేది చాల ప్రధానమైన అవయవాల్లో ఒకటి. ఎందుకంటే రక్తంలో చేరే వ్యర్ధ లేదా విష పదార్ధాలను వడపోసి శుభ్రం చేయడం కిడ్నీల పని. కిడ్నీలు ఏ మాత్రం విరామం లేకుండా రక్తాన్ని శుభ్రం చేస్తుంటాయి. రక్తంలో ఎక్కువగా ఉండే నీటిని, విష పదార్ధాలను ఎప్పటి కప్పుడు వడకడుతూ ఉంటాయి. ఆరోగ్యవంతుడైన మనిషి శరీరంలో రోజుకు 200 లీటర్ల రక్తాన్ని వడకడతాయని అంచనా. ఇది సక్రమంగా జరిగినంతవరకూ ఆరోగ్యం లక్షణంగా ఉంటుంది. ఈ పనితీరులో ఏ మాత్రం తేడా వచ్చినా మూత్రపిండాల ఆరోగ్యంలో ఎక్కడో సమస్య ఉన్నట్టు అర్ధం చేసుకోవాలి.

మూత్ర పిండాల సమస్య ఉంటే లక్షణాలు చాలా సూక్ష్మంగా కన్పించకుండా ఉంటాయి. ఇవి తీవ్రమైతే తప్ప బయటపడవు. అందుకే చాలామంది కిడ్నీ వ్యాధి (Kidney Problem) బారినపడుతుంటారు. నీరసం, బలహీనత అనేవి సాధారణ లక్షణాలతో పాటు మూత్రపిండాల సమస్యల్లో కూడా ఇవే లక్షణాలుంటాయి. కిడ్నీ సమస్య ఉంటే మాత్రం ఈ హార్మోన్ ఉత్పత్తి కాదు. ఫలితంగా రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి తగ్గి..కండరాలు, మెదడు బలహీనమౌతాయి. రుచి కోల్పోవడం మరో ప్రధాన లక్షణం. రక్తంలో మలినాలు పేరుకున్నప్పుడు నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ పనితీరు తగ్గిపోతుంది. దాంతో రుచి గుర్తించడం కష్టమౌతుంది. శరీరం నుంచ వెలువడే శ్వాసలో దుర్వాసన ఉంటుంది. పాదాలు, చేతుల్లో వాపు ఉంటుంది. చీలమండల వద్ద వాపు కనిపిస్తుంటుంది.

ఒకవేళ మీరు కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటే..జీవనశైలిలో మార్పులు చేసుకుని సరైన చికిత్స తీసుకుంటే త్వరగా వ్యాధిని తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. కిడ్నీ సమస్యతో బాధపడేవారు ఎక్కువగా ద్రవాలు తీసుకుంటూ, ఆహారం విషయం (17 Foods to Avoid )లో పలు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెపుతున్నారు. ప్రాసెస్ చేసిన మాంసాలలో అధిక మొత్తంలో ప్రిజర్వేటివ్ లు ఉంటాయి. ఇవి వేయడం వల్లే మాంసం రుచిగా ఉంటుంది. కానీ జంతు ప్రోటీన్ అతిగా తీసుకోవడం వల్ల హైపర్ ఫిల్ట్రేషన్ కి దారి తీస్తుంది. మూత్రపిండాల మీద భారం పడుతుంది. అందుకే వాటికి బదులుగా మొక్కల ఆధారిత ప్రోటీన్ తీసుకోవడం మంచిదని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నోటికి ఎంతో రుచిగా ఉండే ఊరగాయలు అధిక సోడియం కంటెంట్ తో ఉంటాయి. కిడ్నీ సమస్యలతో బాధపడే వ్యక్తులు తప్పనిసరిగా ఊరగాయలకి దూరంగా ఉండాలి. అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ పండుని నివారించడం మంచిది. అలాగే పైనాపిల్ తింటే చాల మంచిదని అంటున్నారు. వీటిలో విటమిన్ ఏ, ఫైబర్, భాస్వరం, సోడియం, పొటాషియం తక్కువగా ఉంటాయని వీటిని తీసుకుంటే చాల మంచిదని చెపుతున్నారు. బంగాళాదుంపలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని తక్కువగా తీసుకోవాలి. రెడ్ మీట్, సాసేజ్, బేకన్ వంటి మాంసాల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో వ్యర్థ పదార్థాల పెరుగుదలకి దారి తీస్తాయి. కినదీ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు చేపలు, ఫౌల్ట్రీ లేదా మొక్కల ఆధారిత ఎంపికలు చేసుకోవాలి. ఇలా మనం తినే ఆహారంలో కొన్ని నియమాలు పాటిస్తే కిడ్నీ సమస్య నుండి బయటపడొచ్చని అంటున్నారు.

Read Also : Healthy Foods: రోజూ మీరు తినే ఆహారంలో ఇవి ఉంటే ఆరోగ్యం మీ వెంటే..!