Site icon HashtagU Telugu

Kidney Patients: కిడ్నీ పేషెంట్లు పొరపాటున కూడా వీటిని అస్సలు తినకండి?

Kidney Problems

Kidney Problems

ప్రస్తుత రోజుల్లో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే కిడ్నీ ఏర్పడడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. కిడ్నీలో రాళ్లు తగ్గించుకోవడం కోసం చాలామంది మెడిసిన్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొంతమంది రకరకాల హోమ్ రెమిడీలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే కిడ్నీ పేషెంట్లు కిడ్నీలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.

మరీ ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అన్న విషయానికి వస్తే.. మూత్రపిండాల వ్యాధులను తగ్గించడానికి ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు వీలైనంత వరకు ఆహారం నుంచి పొటాషియం, భాస్వరం ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ప్రాసెస్ చేసిన మాంసాన్ని కిడ్నీ పేషెంట్లు అస్సలు తినకూడదట. ఎందుకంటే వీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యను మరింత ఎక్కువ చేస్తుందని, అందుకే మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినకూడదని చెబుతున్నారు. ఊరగాయలు ఎంతో టేస్టీగా ఉంటాయి.

కానీ వీటిని మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు తినకూడదు. ఎందుకంటే వీటిలో కూడా సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కిడ్నీ రోగులు వీలైనంత వరకు ఆహారం నుంచి ఊరగాయలకు దూరంగా ఉండటం మంచిది. ఊరగాయ ఎక్కువగా తింటే కిడ్నీకి సంబంధించిన సమస్యలు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందట. అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కిడ్నీ స్టోన్స్ తో బాధపడేవారు ఈ అరటి పండ్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.

ఎందుకంటే అరటి పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీలో స్టోన్స్ ను మరింత ఎక్కువ చేస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా బంగాళాదుంపలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కూడా పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కిడ్నీ పేషెంట్లు బంగాళదుంపలకు దూరంగా ఉండటం మంచిది అని చెబుతున్నారు. చక్కెర ఎక్కువగా ఉండే సోడాలు, కోలాలను మూత్రపిండాల సమస్యలున్నవారు తాగకూడదు. ఎందుకంటే ఇవి కూడా మూత్రపిండాల సమస్యలను పెంచుతుందట.