ఇటీవల కాలంలో రోజురోజుకీ డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే డయాబెటిస్ పేషెంట్లు ప్రతి ఒక్కరూ ఆలోచించేది రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుకోవడం. ఇందుకోసం ఎన్నో రకాల మెడిసిన్స్ ఆయుర్వేద చిట్కాలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండానే ఏదైనా తీపి పదార్థాలు వంటివి తిన్నప్పుడు రక్తంలో షుగర్ లెవెల్ సమాంతం పెరిగిపోతూ ఉంటాయి.
మరి అలాంటప్పుడు రక్తంలో షుగర్ లెవెల్స్ ని ఎలా కంట్రోల్ లో ఉంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నీరు తగినంత తాగకపోతే రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయట. డీహైడ్రేషన్ మీ బాడీ వాసోప్రెసిస్ అనే హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మీ మూత్రపిండాలు ద్రవాన్ని నిలుపుకోవడానికి, మీ మూత్రంలో అదనపు చక్కెరని బయటకి పంపకుండా శరీరాన్ని ఆపుతుంది. రక్తంలోకి మరింత చక్కెరని విడుదల చేయడానికి మీ లివర్‌ని ప్రేరేపిస్తుందని చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయట. మీరు తీసుకున్న పిండి పదార్థాలు అవి చక్కెరగా విడిపోయి రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తాయట. దీంతో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుందని, కార్బ్స్‌ని తగ్గించడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుందని చెబుతున్నారు.
అంతేకాకుండా కార్బ్స్ తక్కువ చేస్తే బరువు కూడా తగ్గుతారట. కాబట్టి కార్బోహైడ్రేట్స్ ని తగ్గించాలని చెబుతున్నారు. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ ని కూడా తగ్గించాలని చెబుతున్నారు. టేబుల్ షుగర్, వైట్ బ్రెడ్, వైట్ రైస్, సోడా, స్వీట్స్, బ్రేక్‌ఫాస్ట్ సెరల్స్, డిజర్ట్స్ ఇవన్నీ కూడా తగ్గించాలట. వీటిని తిన్నప్పుడు త్వరగా జీర్ణమవుతాయి. రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతాయని చెబుతున్నారు. అలాగే ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ మీ బాడీ జీర్ణించుకోవడానికి చాలా సమయం పడుతుంది. దీంతో షుగర్ లెవెల్స్ మెల్లిగా పెరుగుతుంది. పైగా మీ కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించి తక్కువగా తింటారు. తద్వారా బరువు పెరగరు. వర్కౌట్ చేయడం వల్ల ఇన్సులిన్ హార్మోన్ కి మీ కణాల సున్నితత్వం పెంచుతుందట. రక్తంలో చక్కెర పెరుగుదలని కంట్రోల్ చేస్తుందని చెబుతున్నారు.