Mangosteen : పండ్లకు రాణి ‘మ్యాంగోస్టీన్’.. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్

మ్యాంగో మనకు తెలుసు. కానీ మ్యాంగోస్టీన్ పండ్ల గురించి చాలామందికి తెలియదు.

  • Written By:
  • Publish Date - July 2, 2024 / 05:13 PM IST

Mangosteen : మ్యాంగో మనకు తెలుసు. కానీ మ్యాంగోస్టీన్ పండ్ల గురించి చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇవి మన దేశంలో  ఎక్కువగా లభించవు. పండ్ల జాతులలో రాజుగా మ్యాంగోకు పేరు ఉంది. అయితే పండ్ల జాతులలో రాణిగా మాంగోస్టీన్  (Mangosteen) పేరును సంపాదించింది. థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్‌ దేశాలలో మ్యాంగోస్టీన్ తోటలు పెద్దసంఖ్యలో ఉంటాయి. థాయ్‌లాండ్ జాతీయ పండు కూడా ఇదే. మ్యాంగో స్టీన్ శాస్త్రీయ నామం గార్సినియా మ్యాంగోస్టానా (Garcinia mangostana). మ్యాంగోస్టీన్ పండును హిందీలో మంగుస్తాన్ అని పిలుస్తారు. ప్రఖ్యాత హోటళ్లలో వండే అనేక వంటకాల్లో ఈ పండును ఉపయోగిస్తుంటారు. మనదేశంలోని కొన్ని నగరాల్లో బిగ్ బాస్కెట్ వంటి ఈ కామర్స్ సైట్లలో ఈ పండ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో పండును రూ.25 నుంచి రూ.50 వరకు అమ్ముతున్నారు.

We’re now on WhatsApp. Click to Join

మ్యాంగోస్టీన్ పండ్లను(Mangosteen) బ్రిటన్ రాణి విక్టోరియా ఇష్టంగా తినేవారట. తాజా మ్యాంగోస్టీన్ పండ్లను తీసుకొచ్చే ఇచ్చే వాళ్లకు రాణి 9 వేల రూపాయల బహుమతిని ఇచ్చేవారని చెబుతుంటారు. కొన్నాళ్ల పాటు అమెరికాలో ఈ పండ్లను బ్యాన్ చేశారు. ఈ పండు ద్వారా తమ దేశంలోకి ఈగలు రావడం ప్రారంభించడంతో అమెరికా బ్యాన్ విధించింది. అయితే ఈ నిషేధాన్ని 2007లో ఎత్తివేశారు.

Also Read :CM Revanth Reddy : తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంలతో షర్మిల భేటీ.. కీలక ఆహ్వానం

మ్యాంగోస్టీన్ పండు టేస్టీగా ఉంటుంది.  ఇది హెల్త్‌కు చాలా మంచిది. దీన్ని తింటే క్యాన్సర్, గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గిస్తుందని అంటారు.  మ్యాంగోస్టిన్ పండ్లు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. అందుకే వీటిని తింటే క్యాన్సర్ కణాలు ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటాయి. దీంతోపాటు ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలను ఇవి తరిమికొడతాయి.ఈ పండులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. మ్యాంగోస్టీన్ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీన్ని తింటే మహిళల్లో రుతుస్రావ సమస్యలు తగ్గుతాయి. ఈ ఫ్రూట్స్ వల్ల చర్మ సౌందర్యం కూడా బెటర్ అవుతుంది. అతిసర్వత్రా వర్జయేత్. అందుకే  మ్యాంగోస్టీన్‌ పండ్లను కూడా అతిగా తినకూడదు.

గమనిక: పైన ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం. దీన్ని  ‘హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు’ ధృవీకరించదు.