సవికాలం మొదలైంది అంటే చాలా చిన్న పిల్లలనుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా స్విమ్మింగ్ చేయడానికి వెళుతూ ఉంటారు. స్విమ్మింగ్ పూల్స్, బావులు, చెరువులలో స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. స్విమ్మింగ్ చేయడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్న విషయం మనందరికీ తెలిసిందే. బయట ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఒక్కసారి ఇంటిలోకి దిగగానే చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఆ నీటిలో నుంచి మళ్లీ బయటకు రావాలి అనిపించదు. అయితే ఇలా స్విమ్మింగ్ చేసేటప్పుడు చాలా మంది చర్మం గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు.
ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ లో నీరు పాడవకుండా ఉండడం కోసం కెమికల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అలా ఆ నీటిలో ఎక్కువ సేపు ఆడుకోవడం వల్ల చర్మ సంబంధించిన సమస్యలు వస్తాయి. అయితే అలాంటివి ఏమి రాకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్విమింగ్ కి వెళ్లడానికి ముందు, తర్వాత చర్మాన్ని తేమగా ఉంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ వాటర్ లో క్లోరిన్ ఉంటుందట. ఇది శరీరంలో ఉన్న సహజ నూనెలను తొలగిస్తుందట.
అందుకే పూల్ లోకి దిగే ముందు క్లోరిన్ న్యూట్రలైజింగ్ లోషన్ ను చర్మానికి రాసుకోవాలని చెబుతున్నారు. ఈ లోషన్ లో కలబంద, బీస్వాక్స్ మొదలైన మాయిశ్చరైజర్ లు ఉంటాయట. ఇది చర్మాన్ని తేమగా మార్చడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే మీ దగ్గర ఈ లోషన్ లేకపోయినట్లయితే కొబ్బరి నూనె లేదంటే ఆలివ్ ఆయిల్ కూడా ఉపయోగించవచ్చు అని చెబుతున్నారు. అయితే సూర్యుడి హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి ఫుల్ స్లీవ్ స్విమ్మింగ్ గేర్ ని ధరించాలట. ఈతకు 20 నిమిషాల ముందు ఎల్లప్పుడూ మంచి మొత్తంలో వాటర్ ప్రూఫ్ సన్‌స్క్రీన్ ని అప్లై చేయాలనీ చెబుతున్నారు.
అలాగే పూల్ లోకి ప్రవేశించే ముందు చర్మాన్ని తడుపుకోవాలట.
క్లోరిన్ పోస్ట్ స్విమ్ ను గోరువెచ్చని నీటి షవర్ తో శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. ఈత తర్వాత చర్మాన్ని తేమగా మార్చాలట. అలాగే తడి, క్లోరినేటెడ్ వాటర్ దుస్తులలో ఎక్కువసేపు ఉండకూడదట. 40 నుంచి 60 నిమిషాల కంటే ఎక్కువసేపు పూల్ లో ఉంటే, వీలైతే సన్‌స్క్రీన్ ని మళ్లీ అప్లై చేయాలట. ఎందుకంటే చాలా సన్‌స్క్రీన్ లు 40 నిమిషాల వరకు నీటి నిరోధకతను కలిగి ఉంటాయని చెబుతున్నారు. ఈత తర్వాత స్నానం చేయడానికి కఠినమైన సబ్బులు, షాంపూలను ఉపయోగించకూడదట. అలాగే మీ పెదవులు సన్‌బర్న్ , డీహైడ్రేషన్ కు కూడా గురవుతాయట. కాబట్టి ఈత కోసం బయలుదేరే ముందు SPFతో లిప్ బామ్ ను అప్లై చేయాలనీ చెబుతున్నారు. ముఖ్యంగా మీరు నీటిలో ఎక్కువ సమయం గడుపుతున్నట్లయితే, క్రమం తప్పకుండా రాసుకోవాలట. దీని వల్ల పెదాలు కూడా పాడవ్వకుండా ఉంటాయని చెబుతున్నారు.