Site icon HashtagU Telugu

Idli : ఇడ్లీలు తినొద్దు – సర్కార్ కీలక ఆదేశాలు

Causing Plastic In Idli Pre

Causing Plastic In Idli Pre

అందరూ ఆరోగ్యకరమైన ఆహారంగా భావించే ఇడ్లీ (Idli ) ఇప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని తాజాగా వెల్లడైంది. చాలా మంది రోజుకు ఒకసారైనా ఇడ్లీని తినడానికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఇడ్లీలను ఉడికించే విధానంలో జరిగే కొన్ని పొరపాట్ల వల్ల శరీరానికి హానికరమైన పదార్థాలు చేరుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హోటళ్లలో పెద్దఎత్తున ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించి ఇడ్లీలను ఉడికించడం వల్ల వాటిలోని ప్రమాదకరమైన రసాయనాలు ఆహారంతో పాటు శరీరంలోకి ప్రవేశించి క్యాన్సర్‌(Cancer)కు దారితీయవచ్చని కర్ణాటక ఆరోగ్య శాఖ (Karnataka Food Safety Department) వెల్లడించింది.

TS High Court : మల్టీప్లెక్స్ లలోకి పిల్లలు.. తీర్పుని సవరించిన తెలంగాణ హైకోర్టు..

కర్ణాటక ఫుడ్ సెక్యూరిటీ విభాగం నిర్వహించిన తనిఖీల్లో రాష్ట్రంలోని 52 హోటళ్లలో ఇడ్లీలను ఉడికించే సమయంలో పాలిథీన్ కవర్లను ఉపయోగిస్తున్నారని వెల్లడైంది. ఇది కేవలం కర్ణాటకకే పరిమితం కాకుండా, ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశముంది. ప్లాస్టిక్ తాపనకు గురికావడం వల్ల హానికరమైన రసాయనాలు ఆహారంలో కలుసుకొని, అవి శరీరంలో చేరితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా క్యాన్సర్ ముప్పును పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను అదుపు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని హోటళ్లలో ప్లాస్టిక్ షీట్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Revanth : సీఎం అయినప్పటికీ రేవంత్ అసంతృప్తిగా ఉండడమేంటి?

ఇడ్లీలను ఉడికించేటప్పుడు సంప్రదాయంగా వాడే కత్తిలు లేదా ముస్లిన్ క్లాత్‌లను తిరిగి ఉపయోగించడం ఉత్తమం. ప్రజలు కూడా హోటళ్లలో ఇడ్లీ తినేటప్పుడు దీనిపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వాలు కేవలం నిషేధమే కాకుండా ఆచరణలో అమలు జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు అవగాహన కల్పించడం, నియంత్రణ చర్యలు వేగంగా అమలు చేయడం ద్వారా మాత్రమే ఈ సమస్యను అరికట్టవచ్చు అని ఆరోగ్య నిపుణులు కోరుతున్నారు.