Site icon HashtagU Telugu

After Meal: తిన్న తర్వాత ఎట్టిపరిస్థితుల్లో ఈ పనులు చెయ్యకూడదు.. ఎందుకంటే?

After Meals Imresizer

After Meals Imresizer

కొందరు ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. ఇంకొందరు మాత్రం ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే మనం ఆరోగ్యం విషయంలో తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల మనం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా తినడానికి ముందు తిన్న తర్వాత కొన్ని రకాల పనులను చేస్తూ ఉంటాం. అయితే తిన్న తర్వాత తినక ముందు కొన్ని రకాల పనులను చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తినక ముందు విషయం పక్కన పెడితే తిన్న తర్వాత ఎటువంటి పనులు చేయకూడదు. ఒకవేళ అటువంటి పనులు చేస్తే ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాధారణంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే కొన్ని రకాల ఆరోగ్య సూచనలను పాటించాల్సిందే. భోజనం చేసిన కొన్ని పదార్థాలను తినకుండా ఉండటం వల్ల బరువు పెరగడం పొట్ట పెరగడం లాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే భోజనం చేయడానికి ముందు లేదా భోజనం చేసిన తర్వాత పండ్లు ఎక్కువగా తినకూడదు. తిన్న తర్వాత పండ్లు ఎక్కువగా తినడం వల్ల పొట్ట పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా అన్నం తిన్న వెంటనే టీ తాగకూడదు. ఆ విధంగా చేయడం వల్ల తేయకులో ఉండే ఆమ్లాలు, ఆహారంలో ఉండే మాంసంకృతులను శరీరం ఉపయోగించుకోకుండా అడ్డుకుంటాయి.

అదేవిధంగా తిన్న వెంటనే స్నానం చేయకూడదు. దానివల్ల కాళ్లు,చేతుల్లోకి రక్తప్రసరణ పెరుగుతుంది. అందువల్ల పొట్ట చుట్టూ ఉన్న రక్తప్రసరణ తగ్గి జీర్ణ వ్యవస్థ పని తీరు మందగిస్తుంది. అలాగే భోజనం చేసిన తర్వాత పది నిమిషాల పాటు నడక మంచిది అంటారు,కానీ అలా నడవడం వల్ల పోషకాలను గ్రహించడంలో జీర్ణ వ్యవస్థ విఫలమవుతుంది. కాబట్టి తిన్న వెంటనే కాకుండా ఒక 10 నిమిషాల తర్వాత నడవటం మంచిది. అన్నింటికంటే ముఖ్యమైనది చాలామంది తిన్న వెంటనే నిద్రపోతూ ఉంటారు అలా చేయకూడదు. తిన్న వెంటనే పడుకోవడం వల్ల మనం తిన్న ఆహారం జీర్ణం కాక జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.