Site icon HashtagU Telugu

Sleep: రాత్రిళ్ళు నిద్ర పోవడానికి ముందు వేడి పాలలో గసగసాలు కలుపుకొని తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Mixcollage 27 Feb 2024 03 05 Pm 898

Mixcollage 27 Feb 2024 03 05 Pm 898

ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న తెలిసిందే. రాత్రిళ్ళు సరిగా నిద్ర పట్టక అనేక రకాల సమస్యలు బారిన పడుతున్నారు. అంతేకాకుండా రాత్రిళ్ళు నిద్రపోవడానికి ఒక చిన్నపాటి యుద్ధం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక నిద్ర పట్టడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వాటితో పాటు ఇప్పుడు మేము చెప్పబోయే ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు గురకలు పెట్టి మరి నిద్ర పోవాల్సిందే. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. ఇందుకు మనకు కావాల్సిన ముఖ్యమైన పదార్థం గసగసాలు. ఈ గసగసాలు అందరికీ తెలిసిన పదార్థమే. దీనిని ఎక్కువగా మాంసాహారంలో వాడుతూ ఉంటారు.

అయితే ఇప్పుడు నిద్రలేని సమస్యకి ఇది గొప్ప ఔషధంలా ఉపయోగపడుతుంది. అయితే గసగసాల అనంగానే అందరికీ గుర్తొచ్చేది నాన్ వెజ్ ఐటమ్స్ జనరల్ గా చికెన్ మటన్ చాపలు ఇలాంటి పలావు గాని నాదే నైస్ ఐటమ్స్ ఏదైతే ఉంటాయో అవి వండినప్పుడు మాత్రమే మసాలా దినుసులుగా దీన్ని వాడడం అనేది తెలుసు. చాలా మంది మహిళలకు అయితే ఈ గసగసాల ప్రాముఖ్య ఆయుర్వేదం పరంగా కూడా ఒక దివ్య ఔషధంగా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ గసగసాలు చాలా రోగాల మీద దీని ప్రభావం గట్టిగా పని చేస్తా ఉంటుంది. అయితే ఈ గసగసాలను రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. నీళ్ల విరోచనాలు అవుతావుంటే అప్పుడు గసగసాలు పంచదార రెండు కలిపి ఇచ్చేవాళ్ళు ఆ రెండు కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా విరోచనాలు తగ్గేవి.

అయితే ఇలాంటి ఏ సమస్య అయినా గానీ గసగసాల వాడటం వల్ల తొందరగా నివారించబడతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే గసగసాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేసే శక్తి గసగసాలకు ఉంది. వీటిలో ఉండే ఆక్సిలేట్లు కాల్షియంను గ్రహించి రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి. గసగసాలలో పీచు ఎక్కువ. ఇది పేగులు బాగా కదిలేలా చేస్తుంది. తద్వారా అజీర్తి దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. గుండె సమస్య ఉన్నవారు గసగసాలను లేతగా వేపి ఉదయం సాయంత్రం అర స్పూన్ మేర తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. రాత్రిపూట నిద్ర పట్టకపోతే రోజు పడుకునే ముందు వేడి పాలలో గసగసాల పేస్టును కొద్దిగా కలిపి తాగితే చాలు హాయిగా నిద్ర వచ్చేస్తుంది. శరీరంలో అతి వేడి ఉన్నవారు ఈ గసగాసాలను తీసుకుంటే వేడి తగ్గుతుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉండేవారు గసగసాలు వాడవచ్చు. శరీరాన్ని చల్లబరిచే గుణం ఈ గసగసాలలో ఉంటాయి.