Onion Skin Benefits : ఉల్లి తొక్కలతో ఈ విధంగా చేస్తే చాలు.. జుట్టు పెరగడం ఆపడం మీ వల్ల కాదు?

ఉల్లిపొట్టుతో (Onion Skin) ఈ విధంగా చేస్తే చాలు. జుట్టు ఒత్తుగా పెరగడం ఖాయం. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 09:20 PM IST

Benefits of using Onion Skin for the Hair Growth : ఉల్లిపాయ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఉల్లిపాయ (Onion) కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జుట్టుకు సంబంధించిన సమస్యలకు ఉల్లిపాయ (Onion) ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అయితే మీరు కూడా జుట్టుకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారా. మరి ముఖ్యంగా జుట్టు రాలడం, అలాగే పొట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే ఉల్లిపొట్టుతో (Onion Skin) ఈ విధంగా చేస్తే చాలు. జుట్టు ఒత్తుగా పెరగడం ఖాయం. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

ఉల్లి తొక్కల వలన చాలా లాభాలు ఉన్నాయి. ఉల్లి తొక్కలు జుట్టు రాలే సమస్యలను నివారించడంలో బాగా పనిచేస్తాయి. ఉల్లి తొక్కలతో ఒక్కసారి ఇలా చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. ముందుగా ఉల్లితొక్కలను తీసుకొని వాటిని ఒకసారి నీటిలో కడిగి తర్వాత ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. తర్వాత అందులో గుప్పెడు కరివేపాకు కూడా వేసి నీటిలో మునిగేంత వరకు నీటిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని బాగా మరిగించి రంగు మారేంతవరకు ఉండనివ్వాలి. దీనిపై ఒక మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీటిని వడకట్టుకోవాలి.

నీళ్లు మంచి బ్రౌన్ కలర్ లోకి వచ్చాక ఈ నీటిని తలకు స్ప్రే చేయాలి లేదా కుదళ్లకు స్ప్రేను బాగా పట్టించి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు బలంగా తయారవుతుంది. ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది. ఇవి జుట్టు పెరుగుదలను పెంచి జుట్టు రాలడాన్ని ఆపుతాయి. ఇందులో వాడిన కరివేపాకు జుట్టు కుదుర్లను బలంగా చేయడానికి, కురులు నల్లగా ఉండేందుకు దోహదపడతాయి. అలాగే నీరు జుట్టు మెరిసేలా చేస్తుంది. ఈ ఉల్లి నీటిని కనుక వారానికి రెండు సార్లు అప్లై చేయడం వలన జుట్టు పెరుగుదలలో మార్పును చూసి ఆశ్చర్యపోతారు. ఈ నీటిని వారం రోజుల వరకు ఫ్రిజ్లో నిలువ చేసుకోవచ్చు.ఉల్లిపాయ తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి, ఎ, ఇ ప్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో గుండె ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి.

Also Read:  Guntur Jobs : గుంటూరు ఆస్పత్రుల్లో 94 జాబ్స్.. యాదాద్రి జిల్లాలో యువతకు ఉచితంగా సాంకేతిక శిక్షణ