Site icon HashtagU Telugu

Face Beauty : రాత్రి సమయంలో ముఖానికి అది అప్లై చేస్తే చాలు.. ముఖం కాంతివంతంగా మెరిసిపోవాల్సిందే..

Just Apply It On The Face At Night Time.. The Face Should Shine Brightly..

Just Apply It On The Face At Night Time.. The Face Should Shine Brightly..

Tips for Shining and Bright Face : స్త్రీలు అందం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా అందంగా కనిపించడం కోసం తరచూ బ్యూటీ పార్లర్లకు వెళ్లడంతో పాటు వేలకు వేలు ఖర్చు చేసి బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ కొంతమంది మంచి ఫలితాలు లభించలేదని దిగులు చెందుతూ ఉంటారు. ఇక అందంగా కనిపించడం కోసం చాలామంది వంటింటి చిట్కాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఆ సంగతి పక్కన పెడితే.. ముఖం (Face) అందంగా విడిచిపోవాలంటే రాత్రి సమయంలో పడుకునేటప్పుడు ఇవి అప్లై చేస్తే చాలు ముఖం తన తల మెరిసిపోవడం ఖాయం అంటున్నారు నిపుణులు. మరి ముఖం (Face) అందంగా మెరిసిపోవాలంటే అందుకు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

ఇందుకోసం ముందుగా ఒక ఆలుగడ్డను తీసుకోవాలి. ఆలుగడ్డ ఫేస్ పై మొటిమలు మొటిమలు వల్ల వచ్చే నల్లటి మచ్చలు తొలగిస్తుంది. అదేవిధంగా సన్ టాన్ తొలగించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆలుగడ్డ తొక్క తీసుకొని దీనిని మెత్తగా తురుముకోవాలి. తరువాత దీని నుండి వచ్చిన జ్యూస్ ను వడకట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ జ్యూస్ వద్దు అనుకున్న వాళ్లు క్యారెట్ రసాన్ని కూడా లేదా బీట్రూట్ రసాన్ని కూడా వినియోగించుకోవచ్చు. తర్వాత ఇక దీనిలోకి ఒక చెంచా బాదం నూనెను కలుపుకోవాలి. ఈ బాదం నూనె ఫేస్ పై మచ్చలను తగ్గించడానికి అలాగే ఫేస్ నీ స్మూత్ గా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక తర్వాత దీంట్లోకి రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ ని కలుపుకోవాలి. ఈ క్యాప్సిల్స్ మొహం పై ఉండే నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్, ముడతలు లాంటి సమస్యలను నివారించడంలో ఉపయోగపడుతుంది.

తరువాత ఒక చెంచా కలమంద జెల్ ను కూడా కలుపుకోవాలి. ఈ కలమంద ఫేస్ ని స్మూత్ గా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక వీటి అన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. తర్వాత రాత్రి సమయంలో ఫేస్ ని శుభ్రంగా కడుక్కొని ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకుని పడుకోవాలి. ఇది ఫేస్ సిరం లాగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే నిత్యము ఫేస్ పై రాసుకోవడం వలన ముఖంపై వచ్చిన నల్లటి మచ్చలు, మొటిమలు తగ్గిపోయి ముఖం మెరిసిపోతుంది. ఇటువంటి మిశ్రమాన్ని మార్కెట్లో కొనాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే న్యాచురల్ గా తయారు చేసుకుని వాడుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వారి వరకు ఉపయోగించుకోవచ్చు..

Also Read:  Ajwain Water : ప్రతిరోజు వాము నీళ్ళు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..