Site icon HashtagU Telugu

Jujube: రేగిపండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు?

Mixcollage 09 Feb 2024 03 18 Pm 725

Mixcollage 09 Feb 2024 03 18 Pm 725

రేగిపండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి కేవలం కొన్ని సీజన్లలో మాత్రమే మనకు లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సీజన్ సమయంలో మనకు ఈ రేగిపండ్ల ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రేగిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఇందులో బోలెడన్ని వైటమిన్స్ ,మినరల్స్ ఆంటీ ఆక్సిడెంట్ ఫైబర్ ఉంటాయి. మరి వీటి వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే..

ఈ రేగుపండ్లలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి చక్కటి పోషకాలు కావాలంటే రేగుపండ్లను తినాల్సిందే. రేగుపండ్లలో కొన్ని రకాలు ఉన్నాయి. వీటిలో చిన్న రేగు పండ్లులో పొటాషియం, ఫాస్ఫరస్ ,మాంగనీస్, ఐరన్ జింక్ పోషకాల్ని కలిగి ఉంటాయి. ఈ మినరల్స్ మన గుండె ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం. రక్తంలో కీలకమైన హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం. బ్లడ్ షుగర్ నుంచి రేగు పండ్లు కాపాడుతాయి. రక్తప్రసరణ సాఫీగా సాగాలంటే రేగుపండ్లు మన శరీరానికి అవసరం. అలాగే ఎండిన రేగుపండ్లలో కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి.

అర్ధరేటిస్ సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే వారు ఈ రేగు పండ్లు తినడం మంచిది. జ్వరం, జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే తరచూ రేగుపండ్లను తినాలి.రేగి చెట్టు బెరడు తో చేసిన కాషాయం మలబద్దక సమస్యలు నివారిస్తుంది. రేగి ఆకులను నూరి కురుపులు వంటి వాటిపై అప్లై చేస్తే అవి త్వరగా నయంఅవుతాయి. శరీరానికి శక్తిని ఇవ్వడానికి రేగి పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయి.