Site icon HashtagU Telugu

Kidney Problem: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జ్యూస్ లు తప్పనిసరిగా తాగాల్సిందే!

Kidney Problem

Kidney Problem

ప్రస్తుత రోజుల్లో చాలామంది కిడ్నీలకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బ తినడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి వ్యాధులు కూడా కొన్నికొన్ని సార్లు మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేసి,మూత్రపిండాల వ్యాధులకు కారణమవుతాయట. మూత్రం లేదా కిడ్నీల్లో రాళ్లు ఉండటం, నొప్పి నివారణ మందులను ఎక్కువగా వేసుకోవడం వంటి వాటివల్ల కూడా మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు.

అయితే ఇలాంటిప్పుడు కొన్ని రకాల జ్యూస్ లు తాగితే మూత్రపిండాల ఆరోగ్యం బాగా ఉంటుందట. పైనాపిల్ జ్యూస్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందట. పైనాపిల్ లో పొటాషియం చాలా తక్కువగా ఉంటుంది. ఇవి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అందుకే మీ మూత్రపిండాల ఆరోగ్యం కోసం వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు. అలాగే బెర్రీ స్మూతీ లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బెర్రీలు కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

కాబట్టి బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలతో చేసిన పానీయాలు తాగడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. క్యారెట్ జ్యూస్ కూడా మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. అధిక రక్తపోటు పేషెంట్లు కూడా రక్తపోటును తగ్గించడానికి, డయాబెటీస్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి క్యారెట్లను ధైర్యంగా తినవచ్చని చెబుతున్నారు. లేదంటే జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చట.