‎Jeera Water vs Chia Seeds: జీరా వాటర్ లేదా చియా సీడ్స్.. బరువు తగ్గడానికి ఏదో బెస్ట్ తెలుసా?

‎Jeera Water vs Chia Seeds: బరువు తగ్గాలి అనుకున్న వారు జీలకర్ర నీళ్లు లేదంటే చియా సీడ్స్ నీరు ఉదయాన్నే ఏవి తీసుకుంటే ఈజీగా బరువు తగ్గవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Published By: HashtagU Telugu Desk
Jeera Water Vs Chia Seeds

Jeera Water Vs Chia Seeds

‎Jeera Water vs Chia Seeds: బరువు తగ్గడం కోసం చాలామంది ఉదయం నిద్ర లేచిన తర్వాత రకరకాల డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అందులో భాగంగానే కొందరు జీలకర్ర నీరు తాగితే మరికొందరు చియా సీడ్స్ నీరు తాగుతూ ఉంటారు. అయితే ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్ అంటే చాలామంది చెప్పలేరు. మరి ఈ రెండిటిలో బరువు తగ్గడానికి ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జీలకర్ర నీరు జీర్ణక్రియకు బాగా హెల్ప్ చేస్తుందట. బ్లోటింగ్ ని తగ్గిస్తుందని, అలాగే మెటబాలీజం కూడా పెంచుతుందని, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయని, రుచి కూడా మంచిగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

‎కాగా చియా సీడ్స్​లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుందట. ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయట. ఇవి ఫ్యాట్​ లాస్​తో పాటు మజిల్ గ్రోత్​కి హెల్ప్ చేస్తాయని, రక్తంలోని షుగర్​ లెవెల్స్​ ని కంట్రోల్ చేస్తుందని, స్కిన్, హార్ట్ హెల్త్​కి మంచిదని చెబుతున్నారు. మరి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మంచి చేస్తుంది అన్న విషయానికి వస్తే.. జీరా నీరు తాగితే అది మెటబాలీజం పెంచుతుందట. మెటబాలీజం కెలరీలు బర్న్ చేయడంలో హెల్ప్ చేస్తుందని,కానీ ఇది ప్రధాన ఫ్యాట్ బర్నర్ కాదట. అయితే నిజంగా బరువు తగ్గాలనుకుంటే రెగ్యులర్​ గా వ్యాయామం చేయడంతో పాటు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలని చెప్తున్నారు నిపుణులు.

‎చియా సీడ్స్ నీరు తాగితే ఎక్కువ కాలం ఆకలి కాకుండా ఉంటుందట. దీనివల్ల అవసరం లేని ఫుడ్స్​ తీసుకోలేరు. బరువు తగ్గే అవకాశం ఉంటుందట. కానీ దీనిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే జీర్ణ సమస్యలు రావచ్చని, జెల్​ లా ఉంటుంది కాబట్టి కొందరు దీనిని తాగడానికి ఇష్టపడకపోవచ్చని చెబుతున్నారు. ఈ రెండింటిలో బరువు తగ్గేందుకు ఏది బెస్ట్ అంటే చియా సీడ్స్ వాటర్​ అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలో ప్రోటీన్, ఫైబర్ ఉంటుందట. ఇది ఆకలిని కంట్రోల్ చేసి బరువు తగ్గేలా చేస్తుందట. జీరా వాటర్ కూడా మంచి ఫలితాలే ఇస్తుంది కానీ, బెటర్ రిజల్ట్స్ కోసం మీరు ఉదయాన్నే జీలకర్ర నీరు, సాయంత్రం చియా సీడ్స్ వాటర్ తాగవచ్చట. దీనివల్ల జీర్ణ సమస్యలు దూరమవడంతో పాటు బరువు కూడా కంట్రోల్ అవుతుందట. అయితే ఏ డ్రింక్ తీసుకున్నా బరువు తగ్గేందుకు ఫిట్​గా ఉండేందుకు కచ్చితంగా వ్యాయామం చేయాలి అని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ డ్రింక్స్ అనేవి బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తాయి కానీ, వీటివల్లే బరువు తగ్గిపోతారని అనుకోకూడదని చెప్తున్నారు.

  Last Updated: 28 Nov 2025, 09:05 PM IST