Green Tea : జాస్మిన్, గ్రీన్ టీ…వీటి ప్రయోజనాలు తెలుస్తే అవక్కావుతారు..!!

శరీర బరువును తగ్గించుకోవాలంటే డైటింగ్, వ్యాయామం, గ్రీన్ టీ వీటిని ఎక్కువగా ఫాలో అవుతుంటారు జనాలు.

  • Written By:
  • Publish Date - September 17, 2022 / 06:40 PM IST

శరీర బరువును తగ్గించుకోవాలంటే డైటింగ్, వ్యాయామం, గ్రీన్ టీ వీటిని ఎక్కువగా ఫాలో అవుతుంటారు జనాలు. అధిక బరువును అదుపులో పెట్టుకోవాలంటే గ్రీన్ టీ తాగమని డాక్టర్లు కూడా చెబుతుంటారు.గ్రీన్ టీలో ఉండే ముఖ్యపోషకాలు స్థూలకాయం, మధుమేహన్ని నియంత్రించడంలో ఎంతోప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రోజుల్లో గ్రీన్ కాకుండా అనేక ఇతర టీలు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. వీటిలో జిన్సెంగ్ టీ, చమోమిలే టీ, మట్చా గ్రీన్ టీ, జాస్మిన్ టీ, హిమాలయన్ గ్రీన్ టీ, బ్లాక్ టీ, హనీ లెమన్ గ్రీన్ టీ ఇలా ఎన్నో ఉన్నాయి.

అధిక బరువుతో బాధపడుతున్నవారు, బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీ లేదా జాస్మిన్ టీ తీసుకోవడం మంచిది. జాస్మిన్, గ్రీన్ టీలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

గ్రీన్ టీ :
గ్రీన్ టీలో కెఫిన్ ఉంటంది. గ్రీన్ టీపై ఎన్నో పరిశోధనల అనంతరం..ఇది ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. గ్రీన్ తాగడం వల్ల జీవక్రియ తోపాటు నోటి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. అంతేకాదు అధికబరువు, మధుమేహాన్ని కూడా నియంత్రించడంలో ఇది చక్కగా పనిచేస్తుంది.

జాస్మిన్ టీ:
ఈ టీని మల్లెపూల నుంచి తయారు చేస్తారు. అయితే జాస్మిన్, గ్రీన్ టీ మధ్య ఎలాంటి తేడా ఉండదు. జాస్మిన్ టీలో సువాసన మాత్రమే ఉంటుంది. ఈ రెండు టీలు తాగిన ఒకే విధమైన ప్రయోజనాలు పొందవచ్చు. జాస్మిన్ టీ తాగితే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రతిరోజు రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ తాగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.