Site icon HashtagU Telugu

Laugh : జపాన్ లో కొత్త చట్టం..నవ్వకుండా ఉండలేరు

Japan Laugh A Day

Japan Laugh A Day

‘నవ్వడం (Laugh ) ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక మాయరోగం’ అని పెద్దలు అంటారు. ఇది అక్షర సత్యం. ప్రతి రోజు ఒక్కసారైనా నవ్వితే చాలు మన మనసు ఎంతో కుదుటపడుతుంది..మనకు ప్రశాంతతను కల్పిస్తుంది. మన ఆరోగ్యం విషయంలో ఓ దివ్యౌషధంలా నవ్వు పనిచేస్తుంది. నవ్వు అనేక వ్యాధులను దూరం చేసే మంచి టానిక్‌ లాంటిది. దీనిని మించిన వ్యాయామం మరోటి లేదని చెప్పాలి. ‘మీరు మనసారా నవ్వి ఎన్నిరోజులైంది?’.. కడుపుబ్బా నవ్వి కళ్లలో నీరు కనిపించి ఎన్నాళ్లయిందో కదూ. నిజం చెప్పండి. మనస్పూర్తిగా, హాయిగా నవ్వుకోలేకపోతున్నామని బాధపడుతున్నారు కదూ..! అందుకే ప్రతి రోజు ఏదోక సమయంలో ఒక్క చిన్న నవ్వైనా నవ్వాలి. అయితే ఇప్పుడు జపాన్ (Japan ) లో నవ్వు ఫై కొత్త చట్టం (law) తీసుకొచ్చారు. నవ్వు ఫై చట్టం ఏంటి అంటారా..? పౌరుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం సరికొత్త చట్టం తీసుకొచ్చి వార్తల్లో నిలిచింది.

We’re now on WhatsApp. Click to Join.

జపాన్ లోని యమగట ప్రిఫెక్చర్ ప్రభుత్వం తాజాగా ‘లాఫింగ్ లా’ తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం.. పౌరులు రోజుకు కనీసం ఒక్కసారైనా నవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. యమగట యూనివర్సిటీలోని ‘ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్’ పరిశోధనలలో తక్కువగా నవ్వే వారిలో కొంతమంది వివిధ వ్యాధులతో మరణిస్తున్నారని తేలిందని, అందుకే రోజుకు ఓసారి తప్పకుండా నవ్వాలని శుక్రవారం ఓ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. పని ప్రదేశంలో నవ్వుతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహించాలంటూ కంపెనీలను ఆదేశించింది. ప్రతినెలా ఎనిమిదో తేదీని ప్రత్యేకంగా ‘హాస్యంతో ఆరోగ్యం’ కోసం కేటాయించాలని సూచించింది.

వాస్తవానికి ఐదేళ్ల క్రితమే ఓ హెల్త్ జర్నల్‌లో ఇందుకు సంబంధించిన ఓ ఆర్టికల్ పబ్లిష్ అయింది. “నవ్వుతో కలిగే ప్రయోజనాలు” అనే టాపిక్‌పై లోకల్‌గా యమగట యూనివర్సిటీలో రీసెర్చ్ జరిగింది. ఇంత రీసెర్చ్ జరిగిన తరవాతే రూల్‌ తీసుకొచ్చారు. రోజుకోసారి నవ్వడం ద్వారా మానసికంగా, శారీరకంగా కలిగే ప్రయోజనాలేంటో ప్రజలకు అర్థం అవుతుందనే ఉద్దేశంతోనే ఈ నిబంధన తీసుకొచ్చినట్టు ప్రభుత్వం వివరణ ఇస్తోంది.

Read Also : Pawan : ఊడ్చి పడేసిన చెత్త నుంచి కొత్త సంపద సృష్టిస్తాం: డిప్యూటీ సీఎం