Jai Balayya : బాల‌య్య క‌ష్టానికి అవార్డు, బ‌స‌వ‌తార‌కం ఆస్ప‌త్రి దేశంలోనే బెస్ట్‌

నంద‌మూరి బాల‌క్రిష్ణ(Jai Balayya) క‌ష్టం ఫ‌లించింది. బ‌స‌వ‌తార‌కం ఆస్ప‌త్రి చేస్తోన్న సేవ‌లకు జాతీయ స్థాయి గుర్తింపు ల‌భించింది.

  • Written By:
  • Updated On - May 25, 2023 / 03:17 PM IST

నంద‌మూరి బాల‌క్రిష్ణ(Jai Balayya) క‌ష్టం ఫ‌లించింది. బ‌స‌వ‌తార‌కం ఆస్ప‌త్రి(Basavatarakam hospital) చేస్తోన్న సేవ‌లకు జాతీయ స్థాయి గుర్తింపు ల‌భించింది. ఆ ఆనందాన్ని నారా, నంద‌మూరి అభిమానులు ఆస్వాదిస్తున్నారు. భారతదేశంలోనే రెండవ అత్యుత్తమ అంకాలజీ ఆసుపత్రిగా అవుట్ లుక్ ఇండియా మ్యాగజైన్ అవార్డుకు బ‌స‌వ‌తార‌కం ఆస్ప‌త్రిని ఎంపిక చేసింది. ఆ విష‌యాన్ని చంద్ర‌బాబు ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డిస్తూ చైర్మ‌న్ హోదాలో బాల‌క్రిష్ణ చేస్తోన్న సేవ‌ల‌ను కొనియాడారు.

బ‌స‌వ‌తార‌కం ఆస్ప‌త్రి చేస్తోన్న సేవ‌లకు జాతీయ స్థాయి గుర్తింపు (Jai Balayya)

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ‌తికున్న‌ప్పుడే బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి ఆలోచ‌న‌కు బీజం ప‌డింది. క్యాన్స‌ర్ తో మ‌ర‌ణించిన స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కంలాగా ఎవ‌రూ చ‌నిపోకూడ‌ద‌ని ఆయ‌న ఆశించారు. అందుకే, ఆస్ప‌త్రికి పునాది వేశారు. దాన్ని అన‌తికాలంలోనే అభివృద్ధి చేసిన ఘ‌న‌త నంద‌మూరి కుటుంబానికి ఉంది. ప్ర‌త్యేకించి బాల‌క్రిష్ణ (Jai Balayya)త‌నకున్న ఇమేజ్ తో విరాళాల‌ను పెద్ద ఎత్తున సేక‌రించారు. ప్ర‌భుత్వం నుంచి స‌హాయ‌, స‌హ‌కారాల‌ను పొందారు. అందుకు అనుగుణంగా ఆస్ప‌త్రిని విస్త‌రిస్తూ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచేలా చేయ‌గ‌లిగారు. విడ‌త‌ల‌వారీగా విస్త‌రిస్తూ ఆస్ప‌త్రిని క్యాన‌ర్ రోగుల‌కు కేంద్రంగా మార్చేశారు. పేద క్యాన్స‌ర్ రోగుల‌కు బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రికి కొంత ఊర‌ట‌ను ఇస్తుంది.

జాతీయ స్థాయిలో రెండో స్థానంలో

హైదరాబాద్ బంజారాహిల్స్ నందినగర్ లోని ఉన్న బసవతారకం(Basavatarakam hospital) ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ను నెల‌కొల్పారు. తొలి రోజుల్లో చైర్మ‌న్ గా స్వ‌ర్గీయ కోడెల శివ‌ప్ర‌సాద్ ఉన్నారు. స్వ‌త‌హాగా డాక్ట‌ర్ అయిన ఆయ‌న చేసిన సేవ‌లు మ‌రువ‌లేనివి. ఆయ‌న హ‌యాంలో పేద‌ల‌కు ఉచితంగా చికిత్స అందించ‌డానికి కృషి జ‌రిగింది. ఆ త‌రువాత బాల‌క్రిష్ణ చైర్మ‌న్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. తొలి రోజుల్లోనే స్పూర్తిని కొన‌సాగిస్తూ మ‌రింత విస్త‌రిస్తూ వెళ్లారు. అక్క‌డికి వ‌చ్చిన‌ క్యాన్సర్ పేషెంట్లను మామూలు మనుషులుగా చేసింది. ఆ ఆస్పత్రి ద్వారా చాలా మందికి ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి నయమైంది. కొన్ని దశాబ్దాలకు పైగా హైదరాబాద్ కేంద్రంగా వేలాది క్యాన్సర్ రోగులకు సవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్ప‌త్రి సేవ‌లు అందిస్తోంది. ఇప్పుడు దానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం నిర్వాహ‌కుల‌కు మ‌రింత ఉత్సాహాన్ని ఇస్తోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా బాల‌క్రిష్ణ‌కు అబినంద‌న‌లు తెలిపారు. క్యాన్సర్ పేషెంట్లను ట్రీట్ చేయడంలో ఆసుపత్రి సిబ్బంది చేస్తున్న కృషిని ఆయన కొనియాడి, అభినందనలు తెలిపారు.

Also Read : YCP Criminal status : YCP నేర‌ చిట్టా విప్పిన CBN! జ‌గ‌న్ జ‌మానాలో 70శాతం పెరిగిన‌ కోర్టు ఖ‌ర్చు!!

భారతదేశంలోనే రెండవ అత్యుత్తమ అంకాలజీ ఆసుపత్రిగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని అవుట్ లుక్ ఇండియా మ్యాగజైన్ అవార్డుకు ఎంపికైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) వెల్లడించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, యాజమాన్యం, వైద్యబృందం, ఇతర సిబ్బందికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయిలో క్యాన్సర్ చికిత్సను పూర్తిగా అందించేందుకు ఆసుపత్రి చేస్తున్న కృషిని చంద్రబాబు కొనియాడారు. వృత్తిపరమైన నిబద్ధతతో, రోగుల పట్ల దయతో వ్యవహరిస్తూ, వారి పట్ల అత్యంత శ్రద్ధ తీసుకుంటూ, అత్యాధునిక క్యాన్సర్ చికిత్స విధానాలు, చికిత్స వ్యవస్థలను పేదలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. చికిత్సకు ఖర్చు భరించలేని వారికి కూడా బాలకృష్ణ(Jai Balayya) ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయనే స్వయంగా వెల్లడించారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ఆసుపత్రిని స్థాపించామని తెలిపారు.

Also Read : TDP Fight : జ‌గ‌న్ పాల‌న‌పై టీడీపీ `గెరిల్లా` ఫైట్‌