బెల్లం అలాగే తేనె ఈ రెండు కూడా ఆరోగ్యానికి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి రెండింటిని డైరెక్ట్ గా తినడంతో పాటుగా అనేక రకాల వంటల్లో స్వీట్లు తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. వీటిలో తేనె అన్నది సహజ సిద్ధంగా దొరికే ఒక పదార్థం. ప్యూర్ తేనె ఎప్పటికీ కూడా చెడిపోదు. కానీ ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో లభిస్తున్న తేనెలు అన్నీ కూడా కల్తీవే అని చెప్పాలి. ఇకపోతే బెల్లం వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
బెల్లం ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు ఎన్నో ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ఇటీవల కాలంలో చాలా మంది బెల్లాన్ని చక్కెరకు ప్రత్యేక ఉపయోగిస్తున్నారు. ఇకపోతే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది అన్న విషయానికి వస్తే.. కాగా బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, బి1, బి6, సి విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ప్రతీ రోజు బెల్లం తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయట. దీన్ని వల్ల మహిళల్లో రక్తహీనతకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు గుండె, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుందట. కళ్లు, కడుపు, కాళ్ల మంటలనూ తగ్గిస్తుందని చెబుతున్నారు. బెల్లం తరచూ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందట.
బెల్లం నీళ్లు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు అలసట, నీరసం దూరమై తక్షణ శక్తి లభిస్తుందని చెబుతున్నారు. అలాగే తేనె వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చక్కెరకు ప్రత్యామ్నాయంగా తేనెను ఉపయోగిస్తుంటారు. ఇందులో అధిక పోషకాలతో పాటు పెద్ద సంఖ్యలో యాంటీ ఆక్సిడెంట్ల ఉంటాయట. తేనెలో ఫినోలిక్ ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లుతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాటంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యల నుంచి రక్షిస్తుందని చెబుతున్నారు. చాలామంది తేనెను నిమ్మరసంలో కలిపి తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉండడంతో పాటు ఘగర్, బీపీ, గుండె జబ్బులు కంట్రోల్ అవుతాయట. ప్రాణాంతక వ్యాధులతో పోరాడేందుకు శక్తితో పాటు ఇమ్యూనిటీ వ్యవస్థ మెరుగుపడుతుందని చెబుతున్నారు. అయితే బెల్లం, తేనె రెండూ ఆరోగ్యానికి మంచివే అని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటిలో కూడా మంచి పోషకాలు లభిస్తాయట. కానీ తేనెలో కేలరీలు అధికంగా ఉంటాయని, ఇది బరువు పెరగడానికి, రక్తంలో గ్లూకోజ్ పెరుగుదలకు దోహదపడుతుందని చెబుతున్నారు.