Jaggery Tea: బెల్లం టీ తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

చాలామంది ఉదయం సాయంత్రం టీ తాగుతూ ఉంటారు. అందరికీ రోజులో ఒక్కసారి అయినా టీ తాగనిదే రోజు కూడా గడవదు. అయితే కొన్ని బెల్లం టీ తాగితే మరి కొందరు చక్కెర టీ తాగుతూ ఉంటారు. బెల్లం టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. బెల్లం టీని తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు

  • Written By:
  • Publish Date - July 26, 2024 / 04:16 PM IST

చాలామంది ఉదయం సాయంత్రం టీ తాగుతూ ఉంటారు. అందరికీ రోజులో ఒక్కసారి అయినా టీ తాగనిదే రోజు కూడా గడవదు. అయితే కొన్ని బెల్లం టీ తాగితే మరి కొందరు చక్కెర టీ తాగుతూ ఉంటారు. బెల్లం టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. బెల్లం టీని తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. బెల్లం ద్వారా శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. అలాగే వేడి వేడి బెల్లం టీ తాగితే శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట.

మరి బెల్లం టీ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బరువు తగ్గాలనుకునేవారికి బెల్లం టీ చక్కని ఎంపిక అని చెప్పాలి. దీనిలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి, ఆకలిని నియంత్రిస్తుంది. ఫలితంగా మీరు బరువు తగ్గగలుగుతారు. అలాగే శరీరంలో ఐరన్ లోపం కారణంగా, లేదా పీరియడ్స్ కారణంగా చాలా మంది మహిళల్లో రక్తహీనత సమస్య ఉంటుంది. అలాంటి వారికి బెల్లం ఎంతో టీ మేలు చేస్తుంది. బెల్లం టీ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరిచి రక్తహీనత సమస్యను నిరోధిస్తుందట.

అయితే బెల్లం టీ మంచిదే కదా అని ఎక్కువగా తాగితే మాత్రం సమస్యలు తప్పవు. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లు బెల్లం టిని ఎక్కువగా తాగకూడదు. చాలామంది బెల్లంతో తయారు చేసినది కాబట్టి ఏమీ కాదని అనుకుంటూ ఉంటారు. కానీ అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. కాబట్టి బెల్లం దీనిని కూడా మితంగా తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు.

Follow us