Jaggery Tea: బెల్లం టీ తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో చాలామంది తీపి పదార్థాలలో చక్కెరకు బదులుగా ఎక్కువగా బెల్లాన్ని వినియోగిస్తున్నారు. అటువంటి వాటిలో బెల్లం టీ కూడా ఒకటి. చాలామంది టీ కాఫీలలో చక్కెరకు బదులుగా బెల్లంని ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ఎక్కువమంది ప్రజలకు కాఫీ, టీ అలవాటు ఉంటుంది. చలికాలంలో పొద్దున్నే ఒక చుక్క వేడి వేడి టీ తాగాలని అందరూ అనుకుంటారు. దాంతో కొందరు బెల్లంతో తయారు చేసిన టీలు తాగితే మరికొందరు చెక్కరతో తయారు చేసిన తయారు టీలు తాగుతూ ఉంటారు. […]

Published By: HashtagU Telugu Desk
Mixcollage 13 Mar 2024 10 01 Pm 2626

Mixcollage 13 Mar 2024 10 01 Pm 2626

ప్రస్తుత రోజుల్లో చాలామంది తీపి పదార్థాలలో చక్కెరకు బదులుగా ఎక్కువగా బెల్లాన్ని వినియోగిస్తున్నారు. అటువంటి వాటిలో బెల్లం టీ కూడా ఒకటి. చాలామంది టీ కాఫీలలో చక్కెరకు బదులుగా బెల్లంని ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ఎక్కువమంది ప్రజలకు కాఫీ, టీ అలవాటు ఉంటుంది. చలికాలంలో పొద్దున్నే ఒక చుక్క వేడి వేడి టీ తాగాలని అందరూ అనుకుంటారు. దాంతో కొందరు బెల్లంతో తయారు చేసిన టీలు తాగితే మరికొందరు చెక్కరతో తయారు చేసిన తయారు టీలు తాగుతూ ఉంటారు.

మీరు కూడా తరచుగా బెల్లంతో తయారు చేసిన టీ తాగుతూ ఉంటే వెంటనే ఇది తెలుసుకోండి.. బెల్లంటీ తాగితే బరువు తగ్గడమే కాకుండా కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చు. క్రమం తప్పకుండా బెల్లంటీ తాగుతుండటంవల్ల జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి కాబట్టి జీర్ణక్రియ పెరుగుతుంది. మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. చలికాలంలో చాలామంది సులువుగా బరువు పెరుుగుతుంటారు.

బరువు తగ్గాలనుకునేవారు ఆహారాన్ని మార్చి తీసుకోవాలి. కొవ్వును కరిగించడంలో బెల్లం టీ బాగా పనిచేస్తుంది. శీతాకాలంలో బెల్లంతో చేసిన ఆహారాలు తీసుకోవడంవల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అదే శరీరానికి బలంగా మారుతుంది. మహిళలు కూడా బెల్లంటీని తాగాలి. ఇందులో అనేకరకాల పోషకాలు లభిస్తాయి. మహిళల్లో వచ్చే నెలసరి నొప్పులు కూడా బెల్లంటీతో తగ్గించుకోవచ్చు. పీరియడ్స్ లో వచ్చే నొప్పిని తగ్గించడంలో బెల్లంటీ చాలాబాగా పనిచేస్తుంది.

  Last Updated: 13 Mar 2024, 10:03 PM IST