Site icon HashtagU Telugu

Diabetic: బెల్లం మధుమేహం ఉన్నవారికి మంచిదా? ప్రమాదమా?

Daibetes

Daibetes

ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ప్రతి వంద మందిలో దాదాపుగా 60 మంది వరకు డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరైన ఫుడ్ తినకపోవడంతో చిన్నపిల్లలకే డయాబెటిస్ వచ్చేస్తోంది. చాలామంది డయాబెటిస్ పేషెంట్లు బెల్లాన్ని వాడవచ్చు అని చెబుతూ ఉంటారు. బెల్లం చక్కర కంటే ఆరోగ్యకరమని అంటారు. అయితే నిజానికి బెల్లం మన శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ను హరిస్తుంది. ఫలితంగా ఒంట్లో ఉన్న రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా బెల్లంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.

బెల్లంను డయాబెటిస్ పేషెంట్లు వాడొచ్చునని వైద్యులు చెప్తున్నప్పటికీ ఇందులో కెలరిఫిక్ విలువ ఎక్కువ. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లాన్ని ఎక్కువగా వాడటం సరికాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ పేషెంట్లు బెల్లాన్ని తినవచ్చు కానీ మితిమీరి తినడం వల్ల ప్రమాదం ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా పంచదారతో పాటు తీపిదనం అధికం వున్న ఆహార వస్తువులను మధుమేహ వ్యాధిగ్రస్థులు దూరంగా వుంచాలి. బెల్లంలో సూక్రోస్ అధికంగా వుంటాయి. అంతేగాకుండా పంచదార, ఐరన్, మినరల్స్, సాల్ట్ వుంటాయి.

ఇవన్నీ రక్తంలోని చక్కెర స్థాయులను పెంచేస్తాయి. తద్వారా అవయవాలకు మేలు జరగదని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే శ్వాసకోసవ్యవస్థనూ, జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. అందుకే ఇది మంచి హెల్త్ క్లెన్సర్ అంటారు. బెల్లం కాలేయాన్ని కూడా శుభ్రం చేస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా వుండటంతో రుతు సమస్యలతో బాధపడే మహిళలు బెల్లంతో చేసిన పల్లీపట్టి లేదా పాగం పప్పు వంటివి తినమంటారు. మహిళల్లో రుతు సమయంలో వచ్చే నొప్పి నుంచి బెల్లం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

Exit mobile version