Jaggery Benefits: నిద్రపోయే ముందు బెల్లం తీసుకుంటే బోలెడు లాభాలు..!

మీరు మీ ఆహారంలో బెల్లం (Jaggery Benefits) చేర్చవచ్చు. క్రమం తప్పకుండా పరిమిత పరిమాణంలో బెల్లం తీసుకోవడం వల్ల హాని కాకుండా లాభాలు వస్తాయి.

Published By: HashtagU Telugu Desk
Jaggery Benefits

Jaggery Benefits

Jaggery Benefits: ఈరోజుల్లో చాలా మంది స్వీట్స్ తినడానికి దూరంగా ఉండడం మొదలుపెట్టారు. దీనికి కారణం మధుమేహం ముప్పు వేగంగా పెరగడమే. అదే సమయంలో చాలా మంది స్వీట్లను ఇష్టపడతారు. వ్యాధులను నివారించడానికి స్వీట్లను రుచి చూడాలనుకుంటే.. మీరు మీ ఆహారంలో బెల్లం (Jaggery Benefits) చేర్చవచ్చు. క్రమం తప్పకుండా పరిమిత పరిమాణంలో బెల్లం తీసుకోవడం వల్ల హాని కాకుండా లాభాలు వస్తాయి. బెల్లంలో సహజసిద్ధమైన తీపి ఉండడమే ఇందుకు కారణం.

దీనితో పాటు ప్రోటీన్, విటమిన్ బి12, బి6, ఫోలేట్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బెల్లం మీ రక్తపోటు, ఊబకాయాన్ని నియంత్రించగలదు. బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. మీకు తీపి తినాలని కోరిక ఉంటే మీరు బెల్లం తినవచ్చు. పరిమిత పరిమాణంలో బెల్లం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరపై ప్రభావం ఉండదు. అంతే కాదు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

నిద్రలేమి దూరమవుతుంది

పడుకున్న తర్వాత కూడా చాలా మంది నిద్రలేక ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. మీరు కూడా నిద్రలేమితో బాధపడే వారైతే రాత్రిపూట పాలతో బెల్లం కలిపి తాగండి. ఈ రెసిపీని కొన్ని రోజులు పాటిస్తే మంచి నిద్ర వస్తుంది. మరుసటి రోజు మీరు తాజాగా, శక్తివంతంగా ఉంటారు.

Also Read: Trash Balloons: మళ్లీ ఉత్తర కొరియా చెత్త బెలూన్లు..ఈసారి ఎక్కడ పడ్డాయంటే.. ?

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే మీరు రాత్రి పడుకునే ముందు పాలతో బెల్లం క‌లిపి తాగ‌వ‌చ్చు. యాంటీఆక్సిడెంట్లు, జింక్ నుండి సెలీనియం వరకు బెల్లంలో పుష్కలంగా దొరుకుతుంది. ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను నివారించడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

రక్తహీనతను నివారిస్తుంది

శరీరంలో రక్తహీనత లేదా ఐరం లోపం ఉన్నట్లయితే బెల్లం ఆహారంలో చేర్చుకోవ‌చ్చు. ప్రతిరోజూ రాత్రిపూట బెల్లం తినడం వల్ల మీ కణాలలో రక్త కణాలను పెంచుతుంది. ఇది ఐర‌న్‌ను పెంచడం ద్వారా అలసట, బలహీనతను కూడా తగ్గిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

బరువు కూడా తగ్గుతుంది

బెల్లంలో పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇది జీవక్రియను పెంచుతుంది. అలాగే నీటి నిల్వ సమస్యను తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గించడంలో చాలా సహాయకారిగా నిరూపిస్తుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది

మీరు BP పేషెంట్ అయితే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజూ బెల్లం తినడం ప్రారంభించండి. బెల్లంలో ఉండే ఐరన్ రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. బెల్లంలో పొటాషియం, సోడియం ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

  Last Updated: 24 Jul 2024, 10:51 AM IST