Jaggery Effects : చలికాలంలో బెల్లం తింటున్నారా.. అయితే జాగ్రత్త!

బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందుల

  • Written By:
  • Publish Date - January 18, 2024 / 07:00 PM IST

బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో శరీరానికి ఉపయోగపడే ఎన్నో రకాల పోషకాలు విటమిన్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో బెల్లం వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చాలామంది చక్కెరకు బదులుగా ఎక్కువగా బెల్లాన్ని వినియోగిస్తున్నారు. బెల్లం వినియోగించడం మంచిదే కానీ ప్రస్తుతం అనగా శీతాకాలంలో ఉపయోగించడం అంత మంచిది కాదు అంటున్నారు వైద్యులు. మరి శీతాకాలంలో బెల్లం ఉపయోగిస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బెల్లంలో పోషకాలు మెగ్నిషియం, ఐరన్, పొటాషియం వంటివి ఆరోగ్యానికి చాలా మంచివి. ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో బెల్లం చక్కటి పాత్ర పోషిస్తుంది. అయితే, చలికాలంలో బెల్లం తీసుకుంటే మాత్రం హానికరం. చలికాలంలో బెల్లం తీసుకోవడం వలన ఉదర సంబంధిత సమస్యలు వచ్చే చాన్సెస్ ఉంటాయి. అలాగే అజీర్తి సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. వెయిట్ గెయిన్ అయ్యే చాన్సస్ కూడా ఉంటాయి. దాంతో పాటు షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి శీతాకాలంలో బెల్లంని తీసుకున్నప్పటికీ లిమిట్ గా తీసుకోవడం మంచిది. బెల్లం పరిమితికి మించి తీసుకున్నట్లయితే బ్లడ్ లోపల షుగర్ లెవల్స్ బాగా పెరిగే చాన్సెస్ ఉంటాయి.

బెల్లం లిమిట్‌కు మించి తీసుకున్నట్లయితే కడుపులో, నోటిలో మంట వచ్చే చాన్సెస్ కూడా ఉంటాయి. బెల్లంలో ఉండే సూక్రోజ్ వలన ఈ మంట సమస్య వచ్చే అవకాశాలుంటాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి లిమిట్‌గా బెల్లం తీసుకోవాలని అంటున్నారు. బెల్లంలో ఉండేటువంటి సుక్రోజ్, ఒమేగా-3 ఫ్యాట్ యాసిడ్స్ వలన హ్యూమన్ బాడీలో వాపులు వచ్చే చాన్సెస్ ఉంటాయి. ఇకపోతే బెల్లం తయారు చేసే క్రమంలో అందులో కొంత మేరకు అయినా మట్టి ఉండే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి మట్టి వలన కడుపులోకి బెల్లంతో పాటు వెళ్లి నులి పురుగులు ఉండొచ్చు. కాబట్టి ఎక్కువ మోతాదులో బెల్లం తినరాదు. బెల్లంను అధికంగా తినడం వలన హానికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా, తక్కువ మోతాదులోనే తీసుకోవడం మంచిది.