Site icon HashtagU Telugu

Health Benefits: కాలీఫ్లవర్ ఆకులు,వేర్ల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Mixcollage 09 Dec 2023 01 34 Pm 8826

Mixcollage 09 Dec 2023 01 34 Pm 8826

మనకు శీతాకాలంలో అనేక రకాల పండ్లు కాయగూరలు దొరుకుతూ ఉంటాయి.. కేవలం ఈ సీజన్లో మాత్రమే దొరికే వాటిలో కాలీఫ్లవర్ కూడా ఒకటి. ఈ కాలీఫ్లవర్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని ఉపయోగించి మనం ఎన్నో రకాల వంటలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా కాలీఫ్లవర్ తో చేసిన వంటకాలను ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే మీరు తెలియని విషయం ఏమిటంటే కేవలం కాలిఫ్లవర్ వల్ల మాత్రమే కాకుండా దాని ఆకులు,వేర్ల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయట. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. మరి కాలీఫ్లవర్ వేర్లు ఆకుల వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ క్యాలీఫ్లవర్ కోసేటప్పుడు దాని ఆకులు వేర్లు తీసి పడేస్తూ ఉంటారు. అయితే ఈ ఆకుల గురించి కొన్ని రహస్యాలు తెలుసుకోవాలి. క్యాలీఫ్లవర్ ఆకులు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. దీనిలో క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్లవర్ కంటే రెండు రెట్లు అధికంగా ఫైబర్, ప్రోటీన్ ఫాస్ఫరస్ మూడు రెట్లు ఖనిజాలను కలిగి ఉంటుంది. క్యాలీఫ్లవర్ వండుకొని తింటూ ఉంటారు. కానీ కోసే ముందు దాని ఆకులు మాత్రం తీసి వేస్ట్ గా పడేస్తుంటారు. వాస్తవానికి క్యాలీఫ్లవర్ ఆకులలో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాలీఫ్లవర్ ఆకులతో కళ్ళకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని వాడడం రెటీనలో లెవెల్స్ పెరుగుతుంది. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఆకులలో తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేటులతో పాటు అధిక ప్రోటీన్లు ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి.

కావున దీనిని తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు అయితే దానిని ఎన్నో మార్గాలలో ఆహారంలో చేర్చుకోవచ్చు. ఈ ఆకులు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇవి అనేక రకాల తీవ్రమైన గుండె జబ్బుల నుంచి రక్షించడానికి ఉపయోగపడతాయి. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి ఎముకలను దృఢంగా ఉంచడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీనిలో తక్కువ కొవ్వు అధిక ఫైబర్ కంటెంట్ మూలంగా ఇది కార్డియాకు సహాయంగా ఉంటుంది. ఈ ఆకులు క్యాల్షియం యొక్క ఉత్తమ మూలం దీని మూలంగా ఎముకలు నొప్పి, మోకాలు నొప్పి, బోలె ఎముకలు వ్యాధితో ఇబ్బంది పడుతున్న వాళ్లు క్యాలీఫ్లవర్ ఆకులు తీసుకోవడం వలన ఎంతో మేలు జరుగుతుంది. క్యాలీఫ్లవర్ ఆకుల్లో ఐరన్, క్యాల్షియం అధికంగా ఉంటాయి.