Itching : తరచుగా దురద పెడుతుందా…అయితే ఈ ప్రాణాంతక వ్యాధికి సంకేతం కావచ్చు..!!

  • Written By:
  • Updated On - November 15, 2022 / 12:18 PM IST

చర్మంపై దురద అనేది సర్వసాధారణం. అలెర్జీలు, ఫంగల్, బ్యాక్టీరియా ఇన్ఫక్షన్లతోపాటు ఇతర కారణాల వల్ల దురద వస్తంది. కానీ అదేపనిగా దురద వస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధికి లక్షణం కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్యాంక్రియాస కణాలు అనియంత్రిత మార్గంలో పెరిగినప్పుడు అవి కణితులుగా ఏర్పాడుతాయి. తర్వాత కాలంలో క్యాన్సర్ గా మారుతుంది.

ఈ కణాలు శరీరం అంతటా వ్యాపించాయి ప్రాణాలకు మీదకు తెస్తాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు వ్యక్తికి మధ్య తేడా ఉండవచ్చు. అయినప్పటికీ కొన్ని సాధారణ లక్షణాలతో దీన్ని గుర్తించవచ్చు. అవేంటంటే…పొత్తికడుపు, వెన్నునొప్పి, ఆకల లేకపోవడం, అకస్మాత్తుగా బరువు పెరగడం, తగ్గడం, కామెర్లు, ముదురు రంగులో మూత్రం, రక్తం గడ్డకట్టడం, అలసట ఇవన్నీ కారణం. కానీ దాని లక్షణాల్లో ఒకటి…చర్మంలో దురద రావడం. ఇది వ్యాధి తీవ్రమైన రూపాన్ని దాల్చినప్పుడు కనిపిస్తుంది.

ప్యాంక్రియాస్ అనేది శరీరంలోని అత్యంత ముఖ్యమైన ఆర్గాన్స్ లో ఒకటి. మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఇది ఆరోగ్యంగా ఉండాలి. ఫ్యాంక్రియాస్ అనేది కడుపు దగ్గర ఉండే ఒక ఆర్గాన్. ఇది ఆహారం జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు రక్తంలో చక్కర స్థాయిని నియంత్రించడానికి పనిచేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ లో ఏదైనా సమస్య వస్తే మొత్తం శరీర వ్యవస్థ పాడవుతుంది.

దురద తీవ్రంగా ఉందని ఎలా తెలుసుకోవాలి
పైత్య రసంలో ఉండే బిలిరుబిన్ అనే రసాయనం కామెర్లకు కారణం అవుతుంది. కాలేయం బిలిరుబిన్ ను సరిగ్గా ఉత్పత్తి చేయలేనప్పుడు అది కంట్రోల్లో ఉండదు. దీంతో చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారుతంది. దురద చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాు కనిపించవు. అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణం కాదు. కానీ దురద అనేది తీవ్రంగా, ఎక్కువ కాలం ఉంటే అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు సంకేతం కావచ్చు. ఈ వ్యాధి ప్రాంణాంతకం కాబట్టి…వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.